కనగల్ : నల్గొండ జిల్లా కనగల్ మండలంలోని ధర్వేశిపురం స్టేజీ వద్దనున్న శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయం వద్ద దుకాణాలకు సంబంధించి వేలం పాటలు పూర్తయ్యాయి. 2022. 23 ఏడాదికి గాను వివిధ రకాల వస్తు విక్రయాలకు అధికారులు బుధవారం ఆలయ ప్రాంగణంలో టెండర్ కం బహిరంగ వేలం నిర్వహించారు. కొబ్బరి చిప్పల విక్రయ హక్కులను దర్వేసిపురం గ్రామానికి చెందిన సిహెచ్. మల్లేశ్వరి 8 లక్షల 5 వేలకు దక్కించుకున్నారు. వాహన పూజలు, బోట్టు పెట్టేందుకు పర్వతగిరి కి చెందిన పి గణేష్ ఏడు లక్షల 8 వేల కు వేలం దక్కించుకున్నారు మిఠాయి దుకాణానికి సరైన పాట రానందున వాయిదా వేసినట్లు ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ వెంకటలక్ష్మి తెలిపారు .ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో కాశిపట్ల ప్రభాకర్ సత్యమూర్తి , చైర్మెన్ నల్లబోతు యాదగిరి యాదవ్ సిబ్బంది చంద్రయ్య, లింగయ్య ఆంజనేయులు, నాగరాజు, ధర్మకర్తలు నగేష్, యాదగిరి నరసింహ, నాగరాజు ,లక్ష్మణ్ తదితరులు ఉన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement