Sunday, November 24, 2024

Special Story – గ‌నుల వేలం – ఉనికికే ప్ర‌మాదం – ప్రమాదపుటంచున సిరుల ‘సింగరేణి’

4 ఉమ్మడి జిల్లాలకు ఉపాధి కల్పిస్తున్న గనులు
కేంద్ర ప్రభుత్వ విధానాలపై ఆందోళన
విశాఖ ఉక్కు తరహాలో ఉద్యమానికి సన్నద్ధమవుతున్న కార్మిక సంఘాలు

(న్యూస్‌నెట్‌వర్క్‌ ఇన్‌చార్జి, ఆంధ్రప్రభ)
తెలంగాణ ప్రతిష్టకు ప్రతిబింబంగా నిలిచి పన్నెండు జిల్లాల్లో విస్తరించి ఉన్న సింగరేణి బొగ్గు గని సంస్థ.. క్రమక్ర మంగా ప్రమాదపుటంచులకు దగ్గరవుతోంది. తాజాగా బొగ్గు గనుల వేలంపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆ సంస్థ ఉనికి ప్రశ్నార్థకం చేస్తోంది. తాజాగా పాలకులు అవలంభిస్తున్న విధానాలతో సింగరేణి సంస్థ అస్తవ్యస్థ పరిస్థితులను ఎదు ర్కొంటోంది. ఒకప్పుడు అండర్‌ గ్రౌండ్‌ మైన్లు, ఓపెన్‌ కాస్ట్‌ గనులతో వర్ధిల్లిన సింగరేణి ఇప్పుడు బహుళజాతి సంస్థల పోటీని తట్టుకోలేక విలవిల లాడుతోంది. తెలంగాణలో ఉమ్మడి ఖమ్మం, వరంగల్‌, ఆదిలాబాద్‌, కరీంనగర్‌ జిల్లాల్లో విస్తరించి ఉన్న సింగరేణికి క్రమక్రమంగా గనులు తగ్గిపోతున్నాయి. సమీప భవిష్యత్తులో ఎదుర్కొనే దుర్భిక్ష పరిస్థితులను దృష్టిలో పెట్టు కుని ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఒకప్పుడు సరాసరిగా లక్షా 20వేల మంది ఉద్యోగులతో కళ కళలాడిన ప్రతి ష్టాత్మక సంస్థకు ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేసే కుట్ర జరుగు తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దేశం లోనే అగ్రగా మిగా నిలిచి ప్రతిష్టాత్మక అశ్వాపురం భారజల కర్మాగారానికి వెలు గులు ప్రసాదించిన రికార్డును సింగరేణి సొంతం చేసుకుంది. కాలక్రమంలో పాలకుల నిర్లక్ష్యం ఫలితంగా క్షిణిస్తూ వస్తున్న కంపెనీ ప్రస్తుతం 50వేల లోపు ఉద్యోగాలకు పడిపోయింది.

అండర్‌ గ్రౌండ్‌ గనులు తెరిచి పర్యావరణాన్ని కాపాడుతాం, యవతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని హమీలు ఇవ్వడమే తప్ప పాలకులు ఎవరొచ్చినా సింగరేణి సంస్థను బలోపేతం చేస్తామన్న హామీలను ఆచరణలో పెట్టకపోవడం ఇప్పుడు శాపంగా మారుతోంది. ఈ సంస్థను కాపాడుకునేందుకు రాజకీయలకు అతీతంగా అఖిలపక్షంగా ఏర్పడాలని ప్రజా సంఘాల నుండి డిమాండ్‌ వస్తున్నా వారికి తగిన మద్దతు లభించడం లేదు. విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకోవడం కోసం జరిగిన పోరాట స్పూర్తితో సింగరేణి పరిరక్షణ ఉద్యమం మొదలు కావాలన్న డిమాండ్‌ తాజా పరిణామాలతో తెరపైకి వచ్చింది. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సైతం సింగరేణి భవిష్యత్‌పై బాధ్యత తీసుకోవాలనే డిమాండ్‌ రాజకీయ వర్గాలు, సంస్థ కార్మిక సంఘాల నుంచి పెరుగుతోంది.

- Advertisement -

2015కు ముందు సింగరేణిదే గుత్తాధిపత్యం..
2015కి ముందు సింగరేణి పరిధిలో ఉన్న బొగ్గు గనులపై యాజమాన్యానికే గుత్తాధిపత్యం ఉండేది. ఎక్కడ బొగ్గు గనులున్నాయనే విషయాన్ని యాజమాన్యం నిరంతరం వెతుకుతూనే ఉంటు-ంది. ప్రత్యేకంగా సింగరేణిలోని ఒక బృందం బొగ్గు గనుల కోసం అధ్యయనం, పరిశీలన చేస్తూనే ఉంటు-ంది. దాని ప్రకారం చాలా బొగ్గు గనులు ఉన్నాయని, వాటిల్లో కోట్లాది టన్నుల బొగ్గు నిక్షేపాలున్నట్లు- బయట పడింది. ఉదాహరణకు కోయగూడెం, సత్తుపల్లి 3, శ్రావణపల్లిలో ఎంతో పరిశోధన చేసి బొగ్గు నిక్షేపాలున్నట్లు- తెలుసుకుంది. అయితే వాటిని భవిష్యత్‌ అవసరాల కోసం అట్టేపెట్టు-కుంది. ఎందుకంటే ఇపుడు తవ్వకాలు జరుగుతున్న 18 అండర్‌ గ్రౌండ్‌, 22 ఓపెన్‌ క్యాస్ట్‌ గనుల నుండి బొగ్గు నిక్షేపాలు పదేళ్ళపాటు- వస్తాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి 70 మిలియన టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసింది. కాబట్టి అర్జంటు-గా కొత్తగనుల్లో యాక్టివిటీ-స్‌ మొదలు పెట్టాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు.

శ్రావణపల్లి గనిలో 12 మిలియన్‌ టన్నుల నిక్షేపాలు
శ్రావణపల్లి గనిలో 12 మిలియన్‌ టన్నుల బొగ్గు నిక్షేపాలున్నాయి. అలాగే అరబిందో సంస్ధ సొంతం చేసుకున్న రెండు గనుల్లో 20 మిలియన్‌ టన్నుల బొగ్గుంది. బొగ్గు నిక్షేపాల కోసం కోల్‌ ఇండియా లిమి-టె-డ్‌ అధ్యయనాలు చేస్తున్నది. ఎన్ని అధ్యయనాలు చేసినా, ఎంత బొగ్గున్నా సింగరేణికి మాత్రం ఎలాంటి ఉపయోగం ఉండదు. చుట్టూ సముద్రమే ఉన్న తాగటానికి చుక్కనీరు కూడా పనికిరాదన్నట్లు-గా తయారైంది సింగరేణి పరిస్ధితి. ఈ విషయాలన్నీ కిషన్‌రెడ్డికి బాగా తెలుసు. గనులు లేకపోతే మరో పదేళ్ళలో సింగరేణి పరిస్థితి ఏమవుతుందో కూడా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి పూర్తి అవగాహన ఉంది. అన్నీ తెలిసి కూడా మొదట్లో చెప్పుకున్నట్లు- సింగరేణిని ప్రైవేటు-పరం చేసే ప్రశ్నలేదని అందమైన అబద్ధం చెప్పే ప్రయత్నం చేస్తున్నట్లు కార్మిక సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. బొగ్గు తవ్వకాలకు సొంత గనులు లేనపుడు సింగరేణి ఉనికి ఎలా సాధ్యమో చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు. గనులన్నీ ప్రైవేటు-పరం చేసేసిన తర్వాత వేలంపాటల్లో అదాని, జిందాల్‌, టాటాస్టీల్‌ లాంటి సంస్ధలతో సింగరేణి ఏ విధంగా పోటీ-పడగలదనేది రాష్ట్ర ప్రభుత్వానికీ అర్థం కాని సవాళ్ళను విసురుతోంది.

నష్టాలకు దారితీస్తున్న కేంద్ర ప్రభుత్వ చర్యలు…

ఊహించని విధంగా మోడీ ప్రభుత్వం బొగ్గు గనులన్నింటినీ ఒక చట్టం ద్వారా తన పరిధిలోకి తీసేసుకున్నది. తమ పరిధిలోని గనులను తిరిగి తమకే అప్పగించమని యాజమాన్యం ఎన్నిసార్లు మొత్తుకున్నా మోడి ప్రభుత్వం పట్టించుకోలేదు. 15 గనుల్లో తవ్వకాలకు అనుమతులు ఇవ్వాలని యాజమాన్యం కేంద్రాన్ని రిక్వెస్టు చేస్తే వేలంపాటల్లో పాల్గొని గనులను సొంతంచేసుకోమని మోడీ ప్రభుత్వం సమాధానమిచ్చింది. దాంతో ఇప్పుడు సింగరేణికి తవ్వకాలు జరుగుతున్న గనులు తప్ప ఇంకేమీ మిగలలేదు. తాను అధ్యయనంచేసి, నిక్షేపాలున్నాయని కనుగొన్న గనులను కూడా కేంద్ర‌ ప్రభుత్వం లాగేసుకుంది. దాంతో ఇపుడు తవ్వకాలు జరుగుతున్న గనుల నుండి బొగ్గు మహా అయితే మరో పదేళ్ళు వస్తుందంతే. తర్వాత గనులు లేకపోతే సింగరేణి మూతపడాల్సిందే తప్ప వేరేదారిలేదు. ప్రైవేటు-సంస్ధలతో పోటీ-పడి గనులను సొంతం చేసుకోవటం సింగరేణికి సాధ్యంకాదు. 2022లో జరిగిన వేలం పాటల్లో కోయగూడెం, సత్తుపల్లి-3 గనులకు ప్రైవేటు-సంస్ధలు పోటీ-పడితే అరబిందో సంస్ధ సొంతం చేసుకుంది.

వేలంతో అన్ని కోణాల్లోనూ నష్టమే….

నామినేషన్‌ పద్ధతిలో గనులను తీసుకుంటే సదరు రాష్ట్ర ప్రభుత్వానికి కంపెనీ 14శాతం రాయల్టీ చెల్లించాలని అంటు-న్నారు. దాని వల్ల సింగరేణికి లాభం గణనీయంగా తగ్గుతుంది. రాయల్టీ మొత్తం రాష్ట్రానికే చెందుతుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తమ కొచ్చే రాయల్టీని తగ్గించు కుంటే సింగరేణికి కోరుకున్న గనులు వచ్చే అవకాశం ఉంది. ఇంత అనుభవం, యంత్రాలు, ఉద్యోగులు, మౌలిక వసతులు ఉన్న సింగరేణి.. వేలం మాట వినగానే వణికి పోయే పరిస్థితికి కారణమేమిటి అనేది కూడా తేలాల్సిన ప్రశ్నగా మిగిలింది. సింగరేణి ప్రభుత్వ రంగ సంస్థ. వేల ంలో గనులను రాబట్టు-కునే ఇతర సంస్థలు ప్రయివేటు- రం గానికి చెందినవే ఉన్నాయి. రెండింటి మధ్య ఎన్నో వ్యత్యా సాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. పని గం టలు, జీతభత్యాలు, ఉద్యోగ భద్రత, వసతుల కల్పన.. మున్నగునవి ప్రభుత్వ, ప్రయివేటు- రంగాల్లో ఒకేలా ఉండవు. ప్రభుత్వ పాఠశాల, ప్రయివేటు- పాఠశాలలో ఉపాధ్యాయులకు ఏ విషయంలోనూ పోలిక ఉండదు.

అదే ఇక్కడ కూడా వర్తిస్తుంది. ప్రయివేటు- సంస్థ సొంత లాభాల కోసం సిబ్బంది ఖర్చును వీలైనంత తగ్గించే ప్రయత్నం చేస్తుంది. దేశంలో ఉన్న బొగ్గు గనుల సంస్థలకు, ప్రభుత్వ రంగంలో ఉన్న సింగరేణి సంస్థకు విధివిధానాలు, లక్ష్యాలు వేర్వేరుగా ఉన్నాయి. ఇప్పటికే ఉద్యోగులకు ఒక విధానం తయారై అమల్లో ఉంది. సంస్థ అధికారులు చెబుతున్న ప్రకారం దాన్ని మార్చడం కుదరదు. ఈ వ్యవస్థతో ప్రయివేటు- కంపెనీలతో పోటీ-పడడం దానికి అసాధ్యం. అలాగని సింగరేణిని నిర్వీర్యం చేస్తే రాష్ట్రం నిర్వహణలో బొగ్గు ఉత్పత్తి, ఉద్యోగ కల్పన దెబ్బతింటు-ంది. ప్రయివేటు- కంపెనీలు వీలైనంత తొందరగా యంత్రాల సాయ ంతో బొగ్గును తవ్వుకొని లాభాలు దండుకొని వెళ్లిపోతాయి. అదే సింగరేణి అయితే ఉద్యోగాలు కల్పిస్తూ కలకాలం నిలిచి ఉంటు-ందని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement