Saturday, January 25, 2025

Auction – కె పి హెచ్ బిలో భూమి బంగారం – గ‌జం 1.85 ల‌క్ష‌లకు సేల్

హైదరాబాద్ – కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు (కేపీహెచ్‌బీ) పశ్చిమ డివిజన్ పరిధిలోని ఖాళీ ప్లాట్ల వేలంపాట ఈరోజు జరిగింది. తెలంగాణ హౌసింగ్ బోర్డు ప్లాట్లను వేలం వేసింది. చదరపు గజం అత్యధికంగా రూ.1.85 లక్షలు పలికింది. అత్యల్పంగా రూ.1.50 లక్షలు పలికింది. ఇక్కడి 24 ఖాళీ స్థలాలకు గాను 23 స్థలాలకు వేలంపాట ప్రక్రియ పూర్తయిందని అధికారులు తెలిపారు.

ఇదిలా ఉండగా, కేపీహెచ్‌బీ పరిధిలోని ఖాళీ ప్లాట్ల వేలంపాట వ్యవహారంపై హైకోర్టులో శుక్రవారం నాడు విచారణ జరిగింది. కేపీహెచ్‌బీ ఫేజ్ 15 కాలనీ వాసులు దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ టి.వినోద్ కుమార్ విచారణ జరిపారు. ప్రభుత్వం తరఫున ఏజీ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు.

- Advertisement -


54.29 ఎకరాల స్థలంలో లేఔట్ ఉందని, అందులో 10 శాతం గ్రీనరీ కోసం వదిలేయాలని, కానీ గ్రీనరీ కోసం కేటాయించిన స్థలాన్ని కూడా ప్లాట్లుగా చేసి విక్రయిస్తున్నారా? అని కోర్టు ప్రశ్నించింది. అయితే 10 శాతం స్థలాన్ని ఇప్పటికే జీహెచ్ఎంసీకి అప్పగించినట్లు ఏజీ కోర్టుకు తెలిపారు.


లేఔట్‌లో గ్రీనరీ కోసం కేటాయించిన 10 శాతం భూమి వివరాలను ఇవ్వాలని ఏజీని కోర్టు ఆదేశించింది. తుది కేటాయింపులు చేయకూడదనే షరతుతో వేలంపాటను కొనసాగించవచ్చని తెలిపింది. తదుపరి విచారణను వచ్చే గురువారానికి వాయిదా వేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement