ఖమ్మం జిల్లాలో ఘోరం జరిగింది. ఇంటర్ పరీక్షల్లో డీబార్ చేశారన్న కారణంతో ఓ విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేశాడు. బోనకల్ జూనియర్ కాలేజిలో ఇంటర్ ఫిజిక్స్ పరీక్ష రాస్తుండగా ఇన్విజిలేటర్లు పట్టుకున్నారు. కాపీకొడుతున్న కారణంగా బీపీసీ విద్యార్థిని
పరీక్ష కేంద్రం నుండి డీబార్ చేశారు. దీంతో మనస్తాపానికి గురైన ఆ విద్యార్థి గార్లపాడులో తన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇది గమనించిన తోటి స్నేహితులు తలుపులు పగులగొట్టి చికిత్స నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగానే ఉందని డాక్టర్లు చెబుతున్నారు.
Breaking: ఇంటర్ పరీక్షల్లో డీబార్ చేశారని ఆత్మహత్యాయత్నం.. హెల్త్ కండిషన్ సీరియస్
Advertisement
తాజా వార్తలు
Advertisement