నాలుగేళ్ల చిన్నారిపై ఓ యువకుడు లైంగిక దాడికి యత్నించాడు. ఈ ఘటన జనగామ జిల్లాలోని చిలుపూర్ మండలంలోని ఓ గ్రామంలో ఇవ్వాల (శనివారం) జరిగింది. జీవనోపాధి కోసం వచ్చిన ఓ కుటుంబం మేస్త్రి పని చేసుకుని జీవిస్తోంది.. కాగా, వారి కుమారుడైన నిందితుడు ఇవ్వాల చిన్నారి రోడ్డు వెంట వెలుతుండగా మాయమాటలు చెప్పి ఇంట్లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో ఆ పాప గట్టిగా కేకలు పెట్టడంతో చుట్టూ ఉన్న కుటుంబాలు రావడంతో తప్పించుకుని పారిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగా కేసునమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement