Monday, January 6, 2025

KNR | విషెస్‌ చెప్పాడని దాడి.. అవమానంతో విద్యార్థి ఆత్మహత్య

గంభీరావుపేట, (ఆంధ్రప్రభ) : తనతో పాటు చదువుకుంటున్న ఓ అమ్మాయికి నూతన సంవత్సరం వేళ శుభాకాంక్షలు తెలిపిన పాపానికి ఓ విద్యార్థి ప్రాణాలు బలయ్యాయి. అమ్మాయికి న్యూ ఈయర్‌ విషెస్‌ చెప్పడంతో ఆమె కుటుంబ సభ్యులు దాడి చేయగా, అవమాన భారంతో ఆత్మహత్యకు పాల్పడిన ఉదంతం రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం భీముని మల్లారెడ్డి గ్రామంలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే… భీముని మల్లారెడ్డి గ్రామానికి చెందిన శివ కిషోర్‌ తనతో పాటు విద్యనభ్యసిస్తున్న క్లాస్‌ మెట్‌ ఇదే గ్రామానికి చెందిన అమ్మాయికి న్యూ ఇయర్‌ విషెస్‌ చెప్పాడు. దీంతో కోపోద్రేకానికి గురైన అమ్మాయి కుటుంబ సభ్యులు, బంధువులు శివ కిషోర్‌పై దాడికి పాల్పడ్డారు. తనపై దాడి చేయడాన్ని జీర్ణించుకోలేని విద్యార్థి శివకిషోర్‌ అవమాన భారంతో ఆత్మహత్య చేసుకోవడంతో నూతన సంవత్సరం వేళ వారి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.

కాగా శివకిషోర్‌ ఆత్మహత్య విషయం తెలుసుకున్న అమ్మాయి కుటుంబ సభ్యులు ఇంటి నుంచి పరారయ్యారు. శివకిషోర్‌ ఆత్మహత్యకు కారణమైన అమ్మాయి కుటుంబసభ్యులు, బంధువులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్‌ చేస్తున్నారు. గంభీరావుపేట పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అమ్మాయి కుటుంబ సభ్యుల ఆచూకీ కోసం ప్రత్యేక టీమ్‌ ఏర్పాటు చేసినట్లు సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్‌ రెడ్డి తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement