Thursday, November 14, 2024

Attack Case – లగచర్ల ఘటనలో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్

హైదరాబాద్ – లగచర్ల ఘటనలో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. లగచర్ల గ్రామంలో ఫార్మా కంపెనీ ఏర్పాటు పైన రైతుల అభిప్రాయ సేకరణ కోసం కలెక్టర్ అక్కడకు వెళ్లారు. ఆ సమయంలో స్థానికంగా ఉన్న కొందరు కలెక్టర్ పైన దాడికి ప్రయత్నించారు. కలెక్టర్ తో పాటుగా అధికారలు కార్లను ధ్వంసం చేసారు. దీని పైన పోలీసులు కేసు నమోదు చేసారు. వెంటనే అక్కడకు వెళ్లాల్సిందిగా లా అండ్ ఆర్డర్ అదనపు డీజీ మహేష్ భగవత్ ను డీజీపీ ఆదేశించారు.

స్థానికంగా చోటు చేసుకున్న ఘటనల పైన పోలీసు, రెవిన్యూ అధికారులు విచారణ చేసారు. పలువురిని విచారించి సమాచారం సేకరించారు.సురేశ్ తో వరుస ఫోన్లుకలెక్టర్ పైన ఉద్దేశ పూర్వకంగానే దాడికి ప్రయత్నించినట్లు గుర్తించారు. ఈ మొత్తం ఘటనలో సురేస్ అనే వ్యక్తి కీలక సూత్రధారిగా తేల్చారు. సురేష్ తో గత రెండు రోజుల సమయంలో మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి 42 సార్లు ఫోన్ లో మాట్లాడినట్లుగా రికార్డుల్లో స్పష్టమైంది. అయితే, ఈ ఘటన తరువాత సురేష్ కనిపించటం లేదు. దీంతో, పోలీసుల అనుమానం మరింత బలపడింది. గతంలో సురేష్ పైన అత్యాచారంతో పాటుగా పలు దాడులకు సంబంధించి కేసులు ఉన్నట్లుగా చెబుతున్నారు.

- Advertisement -

కలెక్టర్ పైన దాడి ఘటనలోనూ ఆయన రెచ్చగొట్టటం వలనే చోటు చేసుకుందని భావిస్తున్నారు. దీంతో, సురేష్ తో ఫోన్ లో మాట్లాడిన పట్నం నరేందర్ రెడ్డి ప్రమేయం పైన పోలీసులు ఫోకస్ చేసారు.

నరేందర్ రెడ్డి ప్రమేయంఈ మొత్తం వ్యవహారం పైన ప్రభుత్వం సీరియస్ అయింది. సురేష్ కాల్ డేటా పరిశీలించగా పట్నం మహేందర్ రెడ్డితో అన్ని సార్లు మాట్లాడటం తో ఈ కోణం లో విచారణ చేసింది. నరేందర్ రెడ్డి ఎవరెవరితో మాట్లాడారో వివరాలు సేకరించింది. పూర్తి సమాచారం సేకరించిన పోలీసులు ఈ ఉదయం నగరంలోని కేబీఆర్ పార్క్ వద్ద వాకింగ్ చేస్తున్న సమయంలో నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసారు.

నరేందర్ రెడ్డిని విచారణ చేయటంతో పాటుగా మరి కొందరిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్దమయ్యారు. కలెక్టర్ పైన దాడి చేయటం అంటే ప్రభుత్వం పైన జరిగిన దాడిగానే మంత్రులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఈ ఘటనలో ఎవరు ఉన్నా చర్యలు తప్పవని స్పష్టం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement