సంగారెడ్డి జిల్లా కంది జైలులో ఉన్న లగచర్ల రైతన్నలను బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ నేడు పరామర్శించారు. నేడు జైలుకు ములాఖాత్ సమయంలో కెటిఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ పార్టీ నేతల బృందం జైలులో ఉన్న రైతులను కలిసింది.. వారి నుంచి ఘటన వివరాలను కెటిఆర్ అడిగి తెలుసుకున్నారు. రైతులందరూ ధైర్యంగా ఉండాలని కోరారు.. న్యాయపరంగా తాము పూర్తిగా అండగా ఉంటామని చెప్పారు.. రైతులను కలసిన వారిలో ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే లు చింత ప్రభాకర్, అనిల్ జాదవ్, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ తదితరులు ఉన్నారు.
Attack Case – కంది జైలులో ఉన్న రైతులకు కెటిఆర్ పరామర్శ … అండగా ఉంటామని భరోసా
Advertisement
తాజా వార్తలు
Advertisement