ఇప్పటికే ఆయన కుటుంబంపై మూడు కేసులు
వాటిపై విచారణ జరుగుతున్నది
ఈ ఘటనలో ఇప్పటికే 41 ఎ నోటీసులిచ్చాం
గడువు తీరిన తర్వాత చట్ట ప్రకారం ముందుకెళతాం
ఈ కేసు వివరాలను వివరించిన రాచకొండ సిపి సుధీర్ బాబు
హైదరాబాద్ – సినీ నటుడు మోహన్ బాబు కుటుంబ గొడవలపై నమోదైన కేసులపై విచారణ కొనసాగుతున్నదని రాచకొండ సీపీ సుధీర్ బాబు వెల్లడించారు.. అలాగే మోహన్ బాబు వద్ద ఒక డబుల్ బ్యారల్ గన్,, స్పానిష్ మెడ్ గన్ ఉన్నాయన్నారు. వాటిని స్వాధీనం చేయమని ఇప్పటికే నోటీసులు ఆయనకు ఇచ్చామని చెప్పారు. రాచకొండ కమిషనరేట్ లో ఆయన నేడు మీడియాతో మాట్లాడుతూ,, విచారణకు హాజరయ్యేందుకు ఈ నెల 24 వరకు మోహన్ బాబు సమయం కోరారరని చెప్పారు.. అదే విధంగా ఆయన వేసిన పిటిషన్ హైకోర్టులో విచారణలో ఉందని పేర్కొన్నారు.. ఈ రెండింటి దృష్ట్యా మోహన్ బాబుపై ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు.. గడువు తీరిన తర్వాత ఆయనపై చర్యలు చట్టపరంగా తీసుకుంటామన్నారు.. ఇప్పటికీ మంచు కుటుంబం పై మూడు కేసులు నమోదు అయ్యాయని వాటిపై విచారణ చేసి.. చర్యలు తీసుకుంటామని అన్నారు సిపి.
ఆరుగురికి 14 ఎ నోటీసులు..
ఇది ఇలా ఉండగా.. మోహన్ బాబుకు బిగ్ షాక్ తగిలింది. 6 గురికి 41ఏ నోటీసులు అందాయి. మంచు మోహన్‌బాబు పిఆర్వోతో సహా బౌన్సర్లు ఆరుగురికి 41ఏ నోటీసులు జారీ అయ్యాయి. ఈ నెల తొమ్మిదో తేదిన మోహన్ బాబు ఇంటిలో జరిగిన దాడిలో దాడిలో గాయపడిన రిపోర్టర్లు ఫిర్యాదు తో కేసు నమోదు చేశారు పోలీసులు. దీంతో మంచు మోహన్‌బాబు పిఆర్వోతో సహా బౌన్సర్లు ఆరుగురికి 41 ఏ నోటీసులు జారీ అయ్యాయి.
గన్ ను అప్పగించిన మోహన్ బాబు..
ఈరోజు హైదరాబాద్ నుంచి ఏపీలోని చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం రంగంపేటలోని తన యూనివర్సిటీకి వెళ్లిన మోహన్ బాబు తన లైసెన్స్ గన్‌ను పోలీసులకు అప్పగించారు. చంద్రగిరి పోలీస్ స్టేషన్‌లో తన డబుల్ బ్యారెల్ లైసెన్స్‌డ్ గన్‌ను పీఆర్ఓ ద్వారా డిపాజిట్ చేయించారు. ఇటీవల కుటుంబ గొడవల నేపథ్యంలో గన్ సరెండర్ చేయాలని హైదరాబాద్ పోలీసులు ఆయన్ను ఆదేశించడంతో తాజాగా గన్ అప్పగించారు.