Tuesday, November 26, 2024

నల్గొండలో దారుణం.. ప్రేమ పేరుతో వేధింపులు, యువతిపై కత్తితో దాడి

నల్గొండ ప‌ట్ట‌ణంలో దారుణ ఘటన జరిగింది. ప్రేమ పేరుతో వేధిస్తూ ప‌ట్ట‌ప‌గ‌లే ఓ యువ‌తిపై క‌త్తితో దాడికి పాల్ప‌డ్డాడో ప్రేమోన్మాది. తీవ్ర గాయాలైన బాధితురాలు ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటన నల్లగొండ జిల్లా కేంద్రంలోని బీటీఎస్ ఫారెస్ట్ పార్కులో మంగళవారం ‌జరిగింది. దాడికి పాల్పడ్డ యువ‌కుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండలోని దేవరకొండ రోడ్డులో ఉంటున్న రోహిత్ ఎన్జీ కాలేజీలో బీబీఏ సెకండియర్ చదువుతున్నాడు. రోహిత్ ఏడు నెలల నుంచి పానగల్‌కు చెందిన ఓ యువతిని ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు.

మొహర్రం సందర్భంగా సెలవు కావడంతో ఆమె తన స్నేహితురాలితో కలిసి ఫారెస్ట్ పార్క్‌కి వచ్చింది. కాగా, రోహిత్ కూడా అక్కడకు వచ్చాడు. ఆ యువతితో రోహిత్ మాట్లాడాలని చెబుతూ.. తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమెపై విచక్షణారహితంగా దాడి చేశాడు. కడుపులో, చేతులు, కాళ్లు, ముఖంపై కత్తితో పొడిచి అక్కడి నుంచి పారిపోయాడు. తాను తీసుకొచ్చిన వేహికల్​ కూడా అక్కడే వదిలిపెట్టి పారిపోయినట్టుగా స్థానికులు చెప్పారు. కాగా, బాధిత యువతిని వైద్యం కోసం సమీప ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement