అంబర్ పేటలో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు బాలికలపై ప్రేమోన్మాది దాడికి పాల్పడ్డాడు. ఇద్దరికి గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం నిందితుడు రైలు కింద పడి బలవన్మరణంకు పాల్పడ్డాడు.
తనను ప్రేమించాలని ఓ అమ్మాయి వెంట పడ్డాడు. ఆమె ఒప్పుకోకపోవడంతో ఆమె పై కత్తితో దాడికి యత్నించాడు. దానిని అడ్డుకోబోయిన మరో అమ్మాయి పై బాలుడు దాడికి పాల్పడ్డాడు. దీంతో భయాందోళనకు గురైన బాలుడు విద్యానగర్ దగ్గర రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.