హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. రౌడీ షీటర్ ప్రైవేటు భాగాన్ని కట్ చేసి దారుణ హత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత రాత్రి రౌడిషీటర్ ముబారఖ్ సిగార్ పై కత్తులతో దాడి చేసి హత్య చేశారు కొందరు గుర్తుతెలియని వ్యక్తులు. అనంతరం అతడి ప్రైవేటు పార్ట్ లను కోసివేశారు..
ఆ తర్వాత శరీరంపై విచక్షణా రహితంగా కత్తితో పొడిచి మర్డర్ చేశారు.. బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధి వాదియే ముస్తఫా షేహిన్ నగర్ వద్ద ఈ ఘటన జరిగింది. ఇక ముబారఖ్ సిగార్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చరీకి తరలించారు. హత్యకు గల కారణాలపై విచారణ ముమ్మరం చేశారు బాలాపూర్ పోలీసులు.