తెలంగాణ రెండో రాజధాని అయిన వరంగల్ నగరంలోని హన్మకొండలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. పట్టపగలు అందరూ చూస్తుండగానే ఓ వ్యక్తిని మరో వ్యక్తి అతి కిరాతకంగా కత్తితో దాడి చేసి హత్య చేశాడు. అనంతరం నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.
అలాగే దుండగుడి చేతిలో హత్యకు గురైన వ్యక్తిని మడికొండకు చెందిన రాజ్ కుమార్ గా పోలీసులు గుర్తించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. అలాగే ఘనటపై స్థానికులు, కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని, ప్రత్యక్ష సాక్షులు, సీసీటీవీ ఫుటేజ్, కొన్ని ఆధారాలతో నిందితుడి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. కాగా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -