Tuesday, November 19, 2024

Atchampeta – పెద్దలు మందలింపు – దంపతుల బలవన్మరణం

అచ్చంపేట , ప్రభ న్యూస్ – ప్రేమ వివాహం , ఇష్టం లేని పెళ్లి చేసుకున్నారని తల్లిదండ్రులు మందలించడంతో పెళ్లయిన సంవత్సరానికే భార్యాభర్తలు వ్యవసాయ పొలంలో చెట్టుకు ఉరేసుకుని బలవన్మరణం చెందిన విషాద ఘటన బల్మూరు మండలం, జినుకుంట గ్రామంలో ఆదివారం నాడు చోటు చేసుకుంది.

బల్మూర్ ఏఎస్ఐ రేనయ్య తెలిపిన వివరాల ప్రకారం జినుకుంట గ్రామానికి చెందిన ఎం. మహేష్, పోలె భానుమతి సంవత్సరం క్రితము ప్రేమ వివాహం చేసుకున్నారని తెలిపారు. గతంలో వీరి ప్రేమ , పెళ్లి వ్యవహారంలో అమ్మాయి మైనర్ గా ఉన్నందున కేసు నమోదు కావడంతో ఏం. మహేష్ జైలు జీవితం గడిపి బయటికి వచ్చిన అనంతరం మహేష్, భానుమతిలు ఒకరికొకరు ఇష్టపడి మరల పెళ్లి చేసుకున్నారని తెలిపారు.

ఇష్టం లేని పెళ్లి చేసుకోవడంతో తల్లిదండ్రులు మందలించడంతో భార్యాభర్తలు వ్యవసాయం పొలంలోని చెట్టుకు ఉరి వేసుకుని చనిపోయారని తెలిపారు. అమ్మాయి తల్లి ఎల్లమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్ఐ రేణయ్య తెలిపారు. పెళ్లయిన సంవత్సరం పూర్తికాకుండానే భార్యాభర్తలు చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement