Tuesday, October 8, 2024

At Last – అస‌భ్య వీడియోలు చేసిన ప్ర‌ణీత్ అరెస్ట్

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ – హైద‌రాబాద్ – చిన్న పిల్ల‌ల విష‌యంలో అసభ్యంగా ప్రవర్తిస్తూ నీచంగా వీడియోలు చేసిన తెలుగు యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు అరెస్ట్ అయ్యాడు. బెంగ‌ళూరులో పోలీసులు హైద‌రాబాద్‌లో అత‌డిని అరెస్ట్ చేశారు. ఫ‌నుమంతు అనే పేరుతో యూట్యూబ్ ఛాన‌ల్ ర‌న్ చేస్తున్న ప్రణీత్ త‌న ఛాన‌ల్‌లో త‌న ఫ్రెండ్స్‌తో క‌లిసి లైవ్ వీడియోస్‌కి రియాక్ష‌న్ ఇవ్వ‌డం, కామెంట్ల్ చేయ‌డం వంటివి చేస్తాడు. అయితే త‌న ఫ్రెండ్స్‌తో క‌లిసి ఒక వ్లాగ్ చేస్తూ.. తండ్రీకూతుళ్ల అనుబంధంపై అస‌భ్య కామెంట్స్ తో వీడియో చేసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

ఈ వీడియోపై బెంగ‌ళూరుకు చెందిన ఒక అత‌ను ఫిర్యాదు చేయ‌గా ఈ ఫిర్యాదు సీరియస్ గా తీసుకున్న బెంగళూర్ పోలీసులు నేడు అతడిని హైద‌రాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు. ఈ విష‌యంపై ఇప్ప‌టికే నెటిజ‌న్ల‌తో పాటు టాలీవుడ్ న‌టుడు సాయి ధ‌ర‌మ్ తేజ్, సింగ‌ర్ చిన్మాయి, అడివిశేష్, సూధీర్ బాబు, మంచు మ‌నోజ్, స్పందిస్తూ.. అత‌డిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌తో పాటు, డిప్యూటీ సీఎంల‌ను విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement