Thursday, November 21, 2024

ఆ ఇద్దరూ చేయి కలిపారు…(Video)

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తో పీసీసీ స్టార్‌ క్యాంపెయినర్‌, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకున్నది. ఉప్పు నిప్పుగా ఉండే వీరద్దరూ ఏదో అంశంపై సీరియస్‌గా చర్చించుకోవడం పార్టీ శ్రేణుల్లో ఆసక్తిగా మారింది. చాలా రోజుల తర్వాత వీరిద్ద రు గాంధీభవన్‌లో సమావేశం కావడంతో.. ఏమి మాట్లాడు
కున్నారన దానిపైన కాంగ్రెస్‌ నేతలు చర్చించుకుంటున్నారు. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర సందేశాన్ని ప్రతి పల్లెకు, ప్రతి వ్యక్తికి చేరవేసేందుకు ఈ నెల 26 నుంచి రెండు నెలల పాటు హాత్‌ సే హాత్‌ జోడో అభియాన్‌ కార్య క్రమాన్ని కాంగ్రెస్‌ పార్టీ చేపట్టనుంది. ఈ కార్యక్రమం విజయ వంతానికి పార్టీ నేతలతో చర్చించేందుకు పార్టీ రాష్ట్ర వ్యవహా రాల ఇన్‌చార్జ్‌ మాణిక్‌రావు ఠాక్రే శుక్రవారం హైదరాబాద్‌కు వచ్చారు. అందులో భాగంగానే ఎంపీ కోమటిరెడ్డిని ఆహ్వానిం చారు. ఠాక్రే ఆహ్వానం మేరకు గాంధీభవన్‌కు వచ్చిన ఎంపీ కోమటిరెడ్డి.. పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డితో ప్రత్యేకంగా భేటీ కావడంపైన కాంగ్రెస్‌ శ్రేణుల్లో ఆసక్తి నెలకొన్నది.


ఠాక్రే మొదటిసారి రాష్ట్రానికి వచ్చినప్పుడు ఎంపీ వెంకట్‌రెడ్డి గాంధీభవన్‌కు రాకుండా ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు వెళ్లి కలిసి వెళ్లిపోయారు. పీసీసీ అధ్యక్ష పదవిని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా ఆశించారు. అధిష్టానం రేవంత్‌రెడ్డికి అప్పగించగా.. ఎంపీ కోమటిరెడ్డి అప్పటి ఇన్‌చార్జ్‌ మాణిక్యం ఠాగూర్‌, రేవంత్‌రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. అప్పటి నుంచి రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి మధ్య గ్యాప్‌ పెరిగింది. మునుగోడు ఉప ఎన్నిక తర్వాత ఆ గ్యాప్‌ మరింత పెరిగింది. గాంధీభవన్‌ మెట్లు ఎక్కేది లేదని కూడా శపథం చేయడమే కాకుండా.. మునుగోడు ఉప ఎన్నిక ప్రచారానికి వెంకట్‌రెడ్డి దూరంగా ఉన్నారు. అంతేకాకుండా బీజేపీకి ఓటు వేయాలని చెప్పిన ఆడియో బయటికి వచ్చింది. దీంతో ఎంపీ కోమటి రెడ్డికి అధిష్టానం షోకాజ్‌ నోటీసు కూడా జారీ విషయం తెలిసిందే. షోకాజ్‌ నోటీసుపై పార్టీ హై కమాండ్‌ను కలిసి వివరణ ఇచ్చారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
గాంధీభవన్‌ మెట్లు ఎక్కనని ఎప్పుడూ చెప్పలేదు..
కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ మాణిక్‌రావు ఠాక్రే ఆహ్వానం మేరకే గాంధీభవన్‌కు వచ్చినట్లు ఎంపీ కోమటిరెడ్డి తెలిపారు. తన నియోజక వర్గ పనుల్లో బీజీగా ఉండటం వల్లే ఇటీ వల పార్టీ సమావేశాలకు రాలేకపోయినట్లు వివరించారు. తానెప్పు డూ గాంధీభవన్‌కు రానని చెప్పలేదన్నారు. గత 30 ఏళ్లుగా గాంధీ భవన్‌కు వస్తూనే ఉన్నానని అన్నారు. కాంగ్రెస్‌ను ఎలా అధికారంలోకి తీసుకు రావాలనే అంశాన్నే చెబుతానని వివరించారు.
మహేష్‌కుమార్‌గౌడ్‌పై సీనియర్‌ నేత వీహెచ్‌ ఆగ్రహం
సీనియర్‌ నేత వి. హనుమంతరావు గాంధీభవ న్‌ నుంచి అలిగి వెళ్లిపోవడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. తాను ఏర్పాటు చేసిన రాజీవ్‌గాంధీ టోర్నీకి సంబంధించి బహుమతి ప్రదానోత్సవానికి రావాలని ఠాక్రేను ఆహ్వానిం చారు. ముందస్తు కార్యక్రమాలు ఉన్నాయని ఠాక్రే చెప్పారు. చివరకు బహుమతి ప్రధానోత్సవానికి వచ్చేందుకు ఠాక్రేతో పాటు పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి ఒప్పుకున్నారు. అంతలోనే వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేష్‌కుమార్‌ గౌడ్‌ వచ్చి జోక్యం చేసుకుని.. ముందస్తు కార్యక్రమాలు ఉన్నాయని, ఠాక్రే వచ్చేం దుకు కుదరని అనడంతో ఇరువురి మధ్య వాగ్వాదం పెరిగింది. పార్టీ ఇన్‌చార్జ్‌, పీసీసీ చీఫ్‌తో తాను మాట్లాడు తుండగా మధ్యలో మీ జోక్యమేందని వీహెచ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను పిలిస్తేనే ఠాక్రే వచ్చారని మహేష్‌కుమార్‌ చెప్పగా.. వీహెచ్‌ అక్కడి నుంచి కోపంగా వెళ్లిపోయారు. వెంటనే పార్టీ నేతలు వీహెచ్‌కు ఫోన్‌ చేసి సముదాయించినట్లు తెలిసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement