Tuesday, November 26, 2024

ఆడబిడ్డలకు భరోసా కళ్యాణలక్ష్మి : ఎమ్మెల్యే కోరుకంటి

సమైఖ్య పాలనలో లంబాడి తండాల్లో ఆడపిల్లలు పుడితే అమ్ముకునే పరిస్థితులుండేవని, సిఎం కేసీఆర్ పాలనలో పేద వారికి ఆడపిల్ల భారం కావద్దని ఆడపిల్ల పుడితే 13వేలు, కేసీఆర్ కిట్, ఉచితంగా విద్యతో పాటు ఆడబిడ్డల వివాహాల కోసం కళ్యాణలక్ష్మి, షాదిముభారక్ పథకం ద్వారా 1లక్ష 116 రూపాయలు అందిస్తున్న మనసున్న మారాజు కేసీఆర్ అని రామగుండం శాసనసభ్యులు కోరుకంటి చందర్ పేర్కొన్నారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 1కోటి 15 లక్షల 39 వేల 340 రూపాయల విలువగల 116 కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులతోపాటు సీఎం కేసీఆర్ చిత్రపటాన్ని అందజేశారు. ఈసంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ… పేద ఆడపిల్లల వివాహాలకు కళ్యాణ లక్ష్మి, షాదిముభారక్ పథకాలు కొండంత భరోసాగా నిలుస్తున్నాయన్నారు. కరోనా సంక్షోభ సమయంలో కూడా పేద ప్రజలు ఇబ్బందులు పడవద్దని సంక్షేమ పథకాలను అమలు చేసిన పేదల పక్షపాతి సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్య‌తలు తీసుకున్ననాటి నుండి బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలతోపాటు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నారన్నారు.

ప్రజల సంక్షేమంతో పాటు ప్రతి ముఖంలో ఆనందం నింపడమే లక్ష్యంగా పాలన సాగిస్తున్నారన్నారు. పేద ప్రజల కోసం ప్రజాహిత సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి, వారిని కంటికి రెప్పలాగా కాపాడుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పేద ప్రజల గుండెల్లో దేవుడిగా కొలువై ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో రామగుండం నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు, కార్పోరేటర్లు పెంట రాజేశ్, ఎన్.వి.రమణ రెడ్డి, దాతు శ్రీనివాస్, ఇంజపురి పులేందర్, బధవత్ శంకర్ నాయక్, బాలరాజ్ కుమార్, దొంత శ్రీనివాస్, బాదే అంజలిదేవి, అయిత శివ కుమార్, మంచికట్ల దయాకర్, నాయకులు పాతిపల్లి ఎల్లయ్య, రాకం వేణు, కాల్వ శ్రీనివాస్, కాల్వల సంజీవ్, చల్లా రవీందర్ రెడ్డి, ధరణి జలపతి, నీల గణేష్, జాహిద్ పాషా, ఇనుముల సత్యం, పొన్నం లక్ష్మణ్ గౌడ్, నూతి తిరుపతి, మేడి సదయ్య, చిలుముల విజయ్, తోకల రమేష్, తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement