Thursday, November 7, 2024

Assemly – ధ‌ర‌ణితో రైతులు అష్ట‌క‌ష్టాలు .. మంత్రి పొంగులేటి

గుంట భూమిని కూడా అమ్ముకోలేని దుస్థితి
అందుకే మార్పులు చేస్తున్నాం..
భూమాత‌గా పేరుకూడా మారుస్తున్నాం
అసెంబ్లీలో మంత్రి పొంగులేటి..

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ – హైద‌రాబాద్ – గ‌త ప్ర‌భుత్వం తీసుకొచ్చిన ధ‌ర‌ణి పోర్ట‌ల్ తో రైతులు అష్ట‌క‌ష్టాలు ప‌డుతున్నార‌ని, గుంట భూమి కూడా అమ్ముకోలేని పరిస్థితి ఏర్పడిందని మంత్రి పొంగులే శ్రీనివాస్ రెడ్డి అన్నారు. అసెంబ్లీలో పొంగులేటి నేడు ధరణి పై మాట్లాడుతూ.. ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత న్యాయం జరుగుతుంది అని విశ్వాసంలో ఉన్నారు ప్రజలు అన్నారు.

ధరణి నీ ఐఎల్ ఎఫ్ కంపనీకి కోసిఆర్ అప్పగించారని మండిపడ్డారు. ఆ కంపనీ కొన్ని కారణాలతో.. సింగపూర్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంద‌ని ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగపూర్ కంపనీ కి తెలంగాణ భూములు తాకట్టు పెట్టారు కేసీఆర్ అని మండిపడ్డారు. డిఫాల్ట్ కంపనీ కి ధరణి పోర్టల్ అప్పగించారని అన్నారు. బీఆర్ఎస్ చేసిన నిర్వాకంతో రైతుల పాలిట శాపంగా మారిందన్నారు. ఇద్దరు వ్యక్తులు కూర్చొని చేసిన చట్టం ధరణి అన్నారు. ఆల్ ఇన్ వన్ గా చెప్పుకున్న పెద్దాయన చేసిన నిర్వాకం ఇది అని తెలిపారు. .. 2014 లో ధరణి తెచ్చారు కేసీఆర్ అన్నారు. కొండ నాలుక కి మందు వేస్తే…ఉన్న నాలిక పోయినట్టు ఉంది ధరణి అని అన్నారు.

- Advertisement -

ధరణి పేరుతో దగా చేశారు అన్నది నిజం అని అన్నారు. పదేళ్ల తెలంగాణ రాష్ట్రం.. దృతరాష్ట్ర కౌగిలో ఇరుక్కుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. మంచి ఎవరు చేసినా ప్ర‌జ‌లు గుర్తుపెట్టుకుంటార‌ని అంటూ ఇందిరమ్మ ని ఇప్పటికి గుర్తు పెట్టుకుంటున్నారని అన్నారు. 1973లో కాంగ్రెస్ ప్రభుత్వం సీలింగ్ చట్టం తీసుకొచ్చి పేదలకు భూములు పంపిణీ చేసిందన్నారు. వైఎస్ హయాంలో బీడు భూములకు పట్టాలు ఇచ్చారన్నారు . భూ సంస్కరణలతో విప్లవాత్మక మార్పులు తెస్తామని అనేక మంది చెప్పారని.. ఇవాళ ఎక్కడ చూసినా భూ సమస్యలే కనిపిస్తున్నాయని గుర్తు చేశారు. ప్రధానమంత్రి ఇందిరాగాంధీ భూసంస్కరణలకు శ్రీకారం చుట్టార‌న్నారు పొంగులేటి. . పీవీ ప్రధానిగా ఉన్నప్పుడు కూడా భూసంస్కరణలు చేపట్టారన్నారు. ప్రపంచ చరిత్రలో నిలిచిన భూదాన ఉద్యమం ఇక్కడే పుట్టిందన్నారు. 1973లో కాంగ్రెస్ ప్రభుత్వం సీలింగ్ చట్టం తెచ్చి పేదలకు భూములను పంచిందని గుర్తు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement