Tuesday, November 26, 2024

TS: బీఆర్ఎస్ కీలక విజ్ఞప్తిని తిరస్కరించిన అసెంబ్లీ స్పీకర్..

అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య జల యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకుంది. కృష్ణా బేసిన్ ప్రాజెక్ట్‌లను కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రానికి అప్పగించిందని బీఆర్ఎస్ ఆరోపిస్తుండగా..గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులు విధ్వంసానికి గురయ్యాయని అధికార కాంగ్రెస్ పార్టీ కౌంటర్ ఎటాక్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ స్పీకర్‌కు కీలక విజ్ఞప్తి చేసింది.

ప్రభుత్వంతో పాటు ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రజంటేషన్‌కు తమకు అనుమతి ఇవ్వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్‌ను కోరారు. ఈ మేరకు ఇవాళ అసెంబ్లీలో స్పీకర్‌ను కలిసి బీఆర్ఎస్ సభ్యులు వినతిపత్రం ఇచ్చారు. కాగా, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల విజ్ఞప్తిని స్పీకర్ తిరస్కరించారు. అసెంబ్లీలో పపర్ పాయింట్ ప్రజంటేషన్‌కు నిరాకరించారు. మరోవైపు కృష్ణా బేసిన్ ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించమని ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేస్తే దానికి తాము మద్దతు ఇస్తామని బీఆర్ఎస్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement