హైదరాబాద్ – తెలంగాణ అసెంబ్లీలో ఆసక్తికర చర్చ జరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి మాట్లాడుతూ.. మహిళలకు ఫ్రీ బస్సు జర్నీ ఇవ్వటం వల్ల.. ఆటో డ్రైవర్లు ఇబ్బంది పడుతున్నారంటూ ప్రస్తావించారు ఈ వ్యాఖ్యలపై మంత్రి సీతక్క స్పందించారు.
పేద మహిళలు ప్రయాణించేది ఆర్టీసీ బస్సుల్లోనే అని.. అలాంటి పేద మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితం ప్రయాణం కల్పిస్తే.. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎందుకు ఏడుస్తున్నారని ప్రశ్నించారామె. మహిళలకు ఫ్రీ బస్సు ఉండాలా.. వద్దా అనే విషయంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు క్లారిటీ ఇవ్వాలని.. పేద మహిళలకు ఎందుకు ఫ్రీ బస్సు జర్నీ వద్దని ఎందుకు అంటున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు మంత్రి సీతక్క..
దీనికి బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు క్లారిటీ ఇస్తూ ఉచిత బస్సు ప్రయాణానికి తాము ఎప్పుడు వ్యతిరేకం కాదని ఈ విషయాన్ని తాము ఎప్పుడో చెప్పామని అన్నారు…. బస్సులు సంఖ్యను పెంచాలని ఈ సందర్భగా కోరారు.. అలాగే ఈ పథకం వల్ల ఆటోడ్రైవర్లు ఉపాధి కోల్పోతున్నారని, వారిని ఆదుకోవాలని మాత్రమే తాము డిమాండ్ చేస్తున్నామని తేల్చి చెప్పారు..