త్వరలో మూత పడేందుకు రెడీ
అంధకారంలో విద్యార్ధుల భవిష్యత్
ఏకంగా 1913 పాఠశాలలో జీరో ఎన్ రోల్మెంట్
అయిదు లక్షలు విద్యా భరోసా ఇస్తున్నా బడికి రాని పిల్లలు
అసెంబ్లీలో ప్రశ్నిస్తే … మోనమే సమాధానం
రేవంత్ సర్కార్ పై సబితారెడ్డి ఆగ్రహం
హైదరాబాద్ – కాంగ్రెస్ ప్రభుత్వ నిర్వాకంతో మొత్తం 12 వేల స్కూల్స్ మూత పడే అవకాశం ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఐదు లక్షల విద్యా భరోసా ఇస్తా అన్నప్పుడు సంఖ్య పెరగాలి కానీ, ఎందుకు 2 లక్షలు తగ్గింది అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. అసెంబ్లీ ఆవరణలో ఆమె నేడు మీడియాతో మాట్లాడుతూ, స్కూళ్లలో జీరో ఎన్‌రోల్‌మెంట్‌పై అసెంబ్లీలో చర్చించాలని కోరామని అయితే తమ ప్రశ్నను చర్చకు అనుమతించలేదని పేర్కొన్నారు. గురుకులాలు అంటే ఈ ప్రభుత్వానికి కేసీఆర్‌నే కనిపిస్తున్నారని తెలిపారు. కేసీఆర్ హయాంలో ఏర్పాటు చేసిన గురుకులాల్లో 5 లక్షల మంది చదువుతున్నారని తెలిపారు.
10 మంది విద్యార్ధులుంటే …
10 మంది విద్యార్థులు ఉన్న 4 వేల స్కూల్స్ ను వేరే స్కూల్స్ కి మార్చాలన్నారు సబితారెడ్డి. తమ ప్రశ్నలకు విద్యాశాఖకు సంబంధించి ప్రభుత్వం సమాధానం చెప్పదని అర్ధం అవుతుందన్నారు. 1913 జీరో ఎన్ రోల్ మెంట్ అని చెప్తున్నారని తెలిపారు. కేసీఆర్ మన ఊరు మన బడి పేరుతో విద్యా వ్యవస్థలను బలోపేతం చేశారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యకు ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. కాంగ్రెస్ ఎన్నికల ముందు 30 హామీలు ఇచ్చిందన్నారు. ఐదు లక్షల విద్యాబరోసా ఇస్తా అన్నప్పుడు సంఖ్య పెరగాలి.. కానీ ఎందుకు 2 లక్షలు తగ్గిందని ప్రభుత్వాన్ని నిలదీశారు..
మన ఊరు లో భాగంగా స్కూల్స్ లో కేసీఆర్ బ్రేక్ పాస్ట్ ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. ఈ ప్రభుత్వం మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ ఎత్తిసిందని అన్నారు. విషాహారం, కుక్క, పాముకాట్లతో గురుకులాల్లో విద్యార్థులు చనిపోతున్నారని సబితా ఇంద్రారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వీటిపై అసెంబ్లీలో బీఆర్‌ఎస్ అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం పారిపోయిందని అన్నారు. అటు అసెంబ్లీలో.. ఇటు బయట ప్రభుత్వం సమాధానం చెప్పడం లేదని విమర్శించారు. మేం స్కూళ్లకు వెళ్లి చూస్తామంటే కూడా అనుమతించడం లేదని పేర్కొన్నారు.
ప్రభుత్వ విద్యారంగం నిర్వీర్యమైందని పేర్కొన్నారు. విద్యారంగానికి సంబంధించి కాంగ్రెస్ 20 హామీలు ఇచ్చిందని తెలిపారు. కానీ ఇచ్చిన హామీల్లో ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని చెప్పారు. మూసివేయాలని చూస్తున్న స్కూళ్లపై రాష్ట్ర ప్రభుత్వం సమీక్షించాలని సూచించారు.