Thursday, September 19, 2024

Assembly – ‘సిట్ టు రైట్’ హ‌క్కు వారికి క‌ల్పిస్తాం – రేవంత్

సెక్యూరిటీ గార్డులు, ఫోర్త్ క్లాస్ ఉద్యోగులు, పోలీస్ హోంగార్డులు
డ్యూటీ అవ‌ర్స్ లో నిల‌బ‌డే విధులు
దీనిపై స్పందించిన రేవంత్ రెడ్డి
ప్ర‌స్తుతం ఇత‌ర రాష్ట్రాల‌లో అమ‌లును ప‌రిశీలిస్తున్నాం
త్వ‌ర‌లోనే వారికి శుభ‌వార్త వినిపిస్తాం ..

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ – హైద‌రాబాద్ – సెక్యూరిటీ గార్డులు, ఫోర్త్ క్లాస్ ఉద్యోగులు, పోలీస్ హోంగార్డులకు సిట్ టు రైట్ కూర్చునే హక్కు క‌ల్పించే దిశ‌గా ప్ర‌య‌త్నాలు చేస్తున్నామ‌న్నారు సీఎం రేవంత్ రెడ్డి.. ఫోర్త్ క్లాస్ ఉద్యోగులు రోజుకు 10 నుంచి 12 గంటల నిలబడి విధులు నిర్వహిస్తున్నారని, ఈ విషయంలో వారికి ఉపశమనం కలిగేలా పని వేళలో వారికి కూర్చునే హక్కు కల్పించాలనే ప్రతిపాదనపై సభలో సీఎం స్పందిస్తూ, ప్ర‌స్తుతం ఈ విధానం దక్షిణాది రాష్ట్రమైన తమిళనాడులో అమలు అవుతున్నందునా అక్కడ ఉన్న విధివిధానాలను పరిశీలించి సాధ్యాసాధ్యాలపై చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.

- Advertisement -

కాగా, సీఎం స్పందనతో లక్షలాది మంది ఫోర్త్ క్లాస్ ఎంప్లాయిస్ కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. పని వేళలో కనీసం కూర్చొవడానికి సైతం అనుమతి లేక కుటుంబ పోషణ కోసం గంటల తరబడి నిల్చోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ప్రభుత్వం గనుక సానుకూల నిర్ణయం తీసుకుంటే ఇన్నాళ్లు పడుతున్న తమ బాధలకు విముక్తి కలుగుతుందనే సంతోషం ఈ తరగతి ఉద్యోగులలో వ్యక్తం అవుతున్నది.

Advertisement

తాజా వార్తలు

Advertisement