హైదరాబాద్ – కేటీఆర్ మేనేజ్ మెంట్ కోటాలో రాజకీయాల్లోకి వచ్చారని ఎద్దేవా చేశారు రేవంత్ రెడ్డి.. అసెంబ్లీలో కెటిఆర్ చేసిన ప్రసంగానికి కౌంటర్ ఇస్తూ, కేసీఆర్‌కు రాజకీయ జీవితం ప్రసాదించింది కాంగ్రెస్సేనని మర్చిపోవద్దని రేవంత్ రెడ్డి అన్నారు. గత పాలనలో యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్, సింగిల్ విండో చైర్మెన్ గా ఓడినా కేసీఆర్ ను మంత్రిని చేసింది కాంగ్రెస్ పార్టీనేనని గుర్తు చేశారు. వైఎస్ఆర్ పాలనలో కేసీఆర్ కుటుంబం నుంచి ఎమ్మెల్యే గా లేకుండా మంత్రిగా చేశారని తెలిపారు . ప్రజాస్వామ్యంలో 49 శాతానికి 51 శాతానికి చాలా తేడా ఉంటుందని రేవంత్ రెడ్డి అన్నారు. 51 శాతం నెంబర్ ఉన్నవారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. ప్రజాస్వామ్యంలో 49 శాతానికి సున్నా వాల్యూ అని తెలిపారు. నా రిప్లే గురించి బీఆర్‌ఎస్ తహతహలాడుతోందని రేవంత్ రెడ్డి అన్నారు. అచ్చోసిన ఆంబోతులం .. పోడియంకి వస్తాం అనే అహం పనికిరాదని దుయ్యబట్టారు.
దీనిపై కెటిఆర్ ఘాటుగా స్పందిస్తూ, తెలంగాణ ఎన్నుకున్న ముఖ్యమంత్రి కాదని.. ఢిల్లీ నామినేట్ చేసిన ముఖ్య మంత్రి అని రేవంత్ ను దెప్పిపొడిచారు. తనను సీఎం ఎన్ఆర్ఐ అంటున్నారని ఎన్ఆర్ఐని తీసుకొచ్చి పార్టీ అధ్యక్షురాలిని చేసింది ఏ పార్టీనో చెప్పాలన్నారు కెటిఆర్ . ఎన్ఆర్ఐలకు టికెట్‌లు అమ్ముకున్నది ఎవరో చెప్పాలన్నారు. కేకే మహేంధర్ రెడ్డి సీటు గుంజుకుని కేటీఆర్ ఎమ్మెల్యే అయ్యారని రేవంత్ అనగా.. చీమల పుట్టలాంటి కాంగ్రెస్‌లోకి చొరబడింది రేవంత్ రెడ్డే అన్నారు. కేటీఆర్ ది మేనేజ్‌మెంట్ కోటా అని రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు.