Saturday, January 4, 2025

Assembly – మ‌న్మోహ‌న్ వేసిన పునాదుల‌తోనే ఆర్థిక‌రంగంలో భార‌త్ ప‌రుగులు – రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్ – తెలంగాణ బిడ్డ పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్న సమయంలోనూ ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ వేసిన పునాదుల వల్లే నేడు ప్రపంచంతో భారత్ పోటీ పడుతోందని అన్నారు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి. పదవులకే వన్నే తెచ్చిన గొప్ప వ్యక్తి ఆయ‌న అని ప్ర‌శంసించారు. మాజీ ప్రధాని, ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ మృతికి సంతాపం తెలిపేందుకు నేడు తెలంగాణ అసెంబ్లీ ప్ర‌త్యేకంగా స‌మావేశ‌మైంది. ముందుగా స‌భ్యులంతా రెండు నిమిషాలు మౌనం పాటించి ఆర్థిక వేత్త‌కు ఘ‌నంగా నివాళుల‌ర్పించారు..అనంత‌రం మ‌న్మోహ‌న్ సింగ్ సంతాప తీర్మానాన్ని శాసన సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ, . దేశానికి మన్మోహన్ సింగ్ విశేష సేవలు అందించారని రేవంత్ కొనియాడారు.
ఎల్పీజీ, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్‌తో సరళీకృత విధానాలను తీసుకొచ్చి ప్రపంచంతోనే పోటీపడేలా దేశాన్ని తీర్చిదిద్దారని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.

తెలంగాణ రాష్ట్రానికి పురుడు పోసిన వ్య‌క్తి…

తెలంగాణ రాష్ట్రానికి పురుడుపోసిన వ్యక్తి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అని రేవంత్ రెడ్డి అన్నారు. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లును మన్మోహన్ పాస్ చేయించారని, ఇందుకు తెలంగాణ ప్రజలు ఆయన్ను గుండెల్లో పెట్టుకున్నారని సీఎం వెల్ల‌డించారు. తెలంగాణకు రాష్ట్ర హోదా కల్పించిన మానవతావాది, రాష్ట్రానికి ఆత్మబంధువు మన్మోహన్ సింగ్ అని కొనియాడారు. భారతరత్న ఇచ్చి మన్మోహన్‌ను గౌరవించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన ఉద్ఘాటించారు. తెలంగాణలో మన్మోహన్‌ను విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి ప్రకటన చేశారు. హైద‌రాబాద్ లోని ఫైనాన్షియ‌ల్ డిస్డ్రిక్ట్ లో ఆయ‌న విగ్ర‌హాన్ని ఏర్పాటు చేస్తామ‌ని తెలిపారు. మాజీ ప్రధాని విగ్రహం తెలంగాణ ప్రజల్లో స్ఫూర్తి నింపుతుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement