అప్పులతో ఖజనా ఇచ్చింది బిఆర్ఎస్
వచ్చే నిధులన్నీ మిత్తిలకే సరిపోతుంది
అందుకే ఆరు గ్యారంటీల అమలు ఆలస్యం
ఆర్ధిక ఇబ్బందులలో సైతం రుణ మాఫీ చేశాం
ఉచిత బస్సు, విద్యుత్, గ్యాస్ పథకాలు అమలు చేస్తున్నాం
వ్యవసాయం చేసే వారికే రైతు భరోసా ఇస్తాం
సంక్రాంతి తర్వాత రైతుల ఖాతాలలో భరోసా నిధులు
అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన
హైదరాబాద్ – ఆరు గ్యారంటీలు అమలు చేయకపోవడానికి కారణం బిఆర్ఎస్ నని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు.. తలకు మించిన అప్పులతో తెలంగాణ ప్రజలను మోసం చేసింది వారేనని అన్నారు.. బిఆర్ఎస్ నిర్వాకంతోనే ఆరు గ్యారంటీలు అమలులో జాప్యం జరగుతున్నదని అన్నారు. రైతు భరోసాపై మంత్రి తుమ్మల నాగేశ్వరావు ప్రవేశపెట్టిన తీర్మానంపై ఆయన మాట్లాడుతూ, ఏకంగా 11.5 శాతం వడ్డీకి రుణాలు తెచ్చి తెలంగాణను రుణగ్రస్త రాష్ట్రంగా చేశారని మండిపడ్డారు.. ఈ అప్పులపై వడ్డీకే తాము నెలకు ఆరువేల కోట్లు వడ్డీకే కడుతున్నామన్నారు.. ఇతర దేశాలలో ఇలా రుణం తీసుకుంటే వాళ్లను ఉరి తీసేవాళ్లమని అన్నారు.. ఆర్థిక పరిస్థితిని దివాళా తీయించిన బిఆర్ ఎస్ కు తాము ఆరు గ్యారెంటీలు అమలు చేయలేదని అడిగే హక్కు లేదని అన్నారు.. ఇన్ని అప్పులు ఉన్నప్పటికీ ఆరు గ్యారంటీలు అమలునకు కట్టుబడి ఉన్నామని అన్నారు రేవంత్ .. ఉచిత విద్యుత్, ఉచిత బస్సు, రుణ మాఫీని విజయవంతంగా అమలు చేశామన్నారు. తాము కూడా అప్పలు చేస్తున్నామని, అయితే వాటిని అభివృద్ఙి కార్యక్రమాలకే వినియోగిస్తున్నామన్నారు సిఎం.. పిల్లలకు సరైన తిండిపెట్టకపోవడం కూడా గత ప్రభుత్వ ఘనతే అని అన్నారు. హస్టళ్ల బిల్లులు బకాయిలు పెట్టడంతో గురుకులాలలో ఇబ్బందులు కలుతున్నాయన్నారు.. దీని బాధ్యత కూడా బిఆర్ఎస్ దేని చెప్పారు..
వ్యవసాయం చేస్తేనే సాయం …
వ్యవసాయం చేసే ప్రతి రైతుకు రైతు భరోసా ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.. విధివిధానాలు ఖరారు చేసే పనిలో ఉన్నామని, సంక్రాంతి తర్వాత రైతు భరోసా సాయం రైతుల ఖాతాలలో జమ చేస్తామని వెల్లడించారు.. నేడు సభ్యుల అభిప్రాయాలతో రైతు భరోసా విధి విధానాలు ఖరారు చేయాలి అనుకున్నామని తెలిపారు. వ్యవసాయం చేసుకునే వారికి పెట్టుబడి సహాయం అని కేసీఆర్ ప్రభుత్వం జీవోలో స్పష్టం చేసిందని గుర్తుచేశారు. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం గొప్పలకు పోవడం వల్ల అనర్హులకు ఆయాచిత లబ్ధి జరిగిందని అన్నారు. దీని కారణంగా అనర్హులైన వారికి రూ. 22,606 కోట్లు సాగు చేయని భూములకు రైతుబంధు అందిందని చెప్పారు. లే అవుట్‌లకు, రాజీవ్ రహదారి, శ్రీశైలం హైవే, క్రషర్లు, మైనింగ్ భూములకు కూడా రైతు బంధు ఇచ్చారని తెలిపారు. ఇప్పుడు కూడా అదేవిధంగా తాము చేయాల అని ప్రశ్నించారు..
దొంగ పాస్ పుస్తకాలతో రైతుబంధు..
కెసిఆర్ ప్రభుత్వంలో దొంగ పాస్ పుస్తకాలు తయారు చేసి రైతుబంధు తీసుకున్నారన్నారు రేవంత్ రెడ్డి. గత ప్రభుత్వ పెద్దల అనుచరులమని, , బంధువులమని వేల కోట్లు కొల్లగొట్టారన్నారు.. 80వేల పుస్తకాలు చదివినవారు వచ్చి రైతు భరోసాపై సలహా ఇస్తారు అనుకున్నామని, ఈసారి కూడా తాము నిరాశ చెందామన్నారు. కొండలు, గుట్టలు, లే అవుట్లకు కూడా రైతు భరోసా ఇవ్వాలా అని ప్రశ్నించారు. . మమ్మల్ని ఆదర్శంగా తీసుకుని రైతు భరోసా ఇవ్వాలని బిఆర్ఎస్ అంటున్నదని, అంటూ . మీరు కాదు మాకు ఆదర్శకాదని తేల్చి చెప్పారు రేవంత్ . . మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటే తామము ఇక్కడ ఉండేవారం కాదని అన్నారు..మీరు ఇప్పటికే 2023లో ఓడి పోయారని, ఆ తర్వాత లోక్ సభ ఎన్నికలలో డిపాజిట్లు పోయాయని గుర్తు చేశారు. . ఇకముందు ఊడ్చుకుపోతారని బిఆర్ఎస్ ను ఉద్దేశించి అన్నారు.. . వ్యవసాయ దారులు మాకు ఆదర్శమన్నారు.
రైతు భరోసా ఎవరికి ఇవ్వాలో మీ సూచనలు చెప్పండని తాము కోరితే అబద్దాల సంఘం అధ్యక్షుడు అయిన కెసిఆర్ సభకు రాలేదని దెప్పిపొడిచారు రేవంత్ .ఇక ఉపాధ్యక్షుడు సభకు వచ్చి రైతు ఆత్మహత్యల పై అబద్ధాలు చెబుతున్నారు’’ అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014లో 898 మంది, 2015లో 1358, 2016లో 632 మంది మొత్తంగా తెలంగాణలో 3వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. . 2014 నుంచి16 మధ్య కేంద్ర లెక్కల ప్రకారం రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో ఉందన్నారు… ఇది అందరం తలదించుకునే విషయమన్నారు . దీన్ని కూడా గొప్పగా చెప్పుకుంటున్నారని మండిపడ్డారు రేవంత్. . ఓడినా మనుషులు , మాటలు మారడం లేదని బిఆర్ఎస్ నేతలకు చురకలంటించారు.
మీ రుణ మాఫీ వడ్డీలకే సరి..
బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో చేసిన రుణమాఫీ రూ.16, 909 వేల కోట్లు అని వివరించారు రేవంత్ .. ఆ మొత్తం రైతుల తెచ్చిన రుణంపై వడ్డీకే సరిపోయిందన్నారు.. . అసలు అలాగే ఉండిపోయిందన్నారు.. మీరు నాలుగేళ్లలో కేవలం 21 లక్షల మందికి మాత్రమే రుణమాఫీ జరిగింది.’’ అని గుర్తుచేశారు.