హైదరాబాద్ – మార్పు…మార్పు అంటున్నారు.. వంద ఎకరాల అగ్రికల్చర్ యూనివర్సిటీ భూములపై విద్యార్థులు ఆందోళన చేస్తే పోలీసులు కొట్టారు…ఇదేనా మార్పు అంటే అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. ప్రగతి భవన్ కంచెలు తీసి …అసెంబ్లీ ముందు మాత్రం మూడు వేల మంది పోలీసులను పెట్టారు….ఇదేనా మార్పు ? అని ప్రశ్నించారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా పల్లా మాట్లాడుతూ, బీఆర్ఎస్ హయాంలో రైతు ఆత్మ హత్యలు లేకుండే అని అన్నారు. రైతు భరోసా వెస్తం అన్నారు…రెండు లక్షల ఋణ మాఫీ ఓకే సారి చేస్తాం అన్నారు.. ఏమైంది ? అని ప్రశ్నించారు. కౌలు రైతుల గురించి గవర్నర్ ప్రసంగంలో లేనే లేదన్నారు. రైతు భరోసా ఎందుకు ఇస్థలేరు? అని ప్రశ్నించారు. బెదిరిస్తున్నరు.. సీఎం ను ప్రసన్నం చేసుకునేందుకు మంత్రుల తాపత్రయం పడుతున్నారని అన్నారు.
గవర్నర్ తో 30మోసాలు, 60 అబద్దాలు చెప్పించడమే మీ ఘనత
గవర్నర్తో ముప్ఫై మోసాలు, అరవై అబద్ధాలు చెప్పించారని విమర్శిచారు. గవర్నర్ ప్రసంగంలో అరచేతిలో వైకుంఠం చూపించారన్నారు. మేనిఫెస్టలోని అంశాలు గవర్నర్ ప్రసంగంలో లేవని, హామీ ఊసే లేదన్నారు. ప్రగతి భవన్ గతంలో కూడా ప్రజా భవనేనని స్పష్టం చేశారు.. గత ప్రభుత్వం ప్రగతి భవన్లో ఎన్నో సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిందన్నారు. సింగరేణి కార్మికుల సమస్యలు తీర్చింది ప్రగతి భవనే అన్నారు. సీఎం రేవంత్ కనీసం వారానికి ఒక్కసారి కూడా ప్రజావాణికి హాజరుకాలేదని విమర్శించారు. ఆరు గ్యారంటీల గురించి కాంగ్రెస్ గొప్పగా చెప్పుకుంటుందని, గవర్నర్ ప్రసంగంలో కూడా అబద్ధాలు చెప్పారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఒక గ్యారంటీలో ఒక పథకాన్ని మాత్రమే అమలు చేశారన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద రూ.20 కోట్లు ఖర్చు చేస్తే రూ.60 కోట్లు ప్రచారం చేసుకున్నారని ఎద్దేశా చేశారు.
13 అంశాల్లో కేవలం రెండు మాత్రమే అమలుచేశారని చెప్పారు. మహిళలకు ఉచిత బస్సులిచ్చారు.. బస్సుల సంఖ్య పెంచలేదని , ట్రిప్పులు పెంచలేదని విమర్శించారు. ఉచిత ప్రయాణాన్ని తమ పార్టీ స్వాగతిస్తుంటే మీరేమో దానిని కూడా బద్నామ్ చేస్తున్నారు… మేం అటో డ్రైవర్ల గురించి ప్రస్తావిస్తే, మహిళ ప్రయాణీకులకు వ్యతిరేకమని ముద్ర వేస్తున్నారన్నారు.. ప్రమాణ స్వీకారం రోజునే రైతు రుణమాఫీ చేస్తామన్నారు. కాంగ్రెస్ నేతలు ఇచ్చిన హామీలనే అమలు చేయాలని తాము అడుగుతున్నామని చెప్పారు. ఆరున్నర లక్షల మందికిపైగా ఆటో డ్రైవర్ల జీవితాలు ప్రమాదంలో పడ్డాయన్నారు. రెండు నెలల్లో 21 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలకు రూ.20 లక్షల పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.