Saturday, December 21, 2024

Assembly – వంద శాతం రుణ‌మాఫీ‍ ‍‍‍‍‍‍- నిరూపిస్తే రాజ‌కీయ స‌న్యాసం – ప్ర‌భుత్వానికి కెటిఆర్ స‌వాల్

హైద‌రాబాద్ – ఈ రాష్ట్రంలో ఏ ఒక్క ఊరిలోనైనా వంద శాతం రుణ‌మాఫీ జ‌రిగిన‌ట్టు నిరూపిస్తే స్పీక‌ర్ ఫార్మాట్‌లో రాజీనామా వెంట‌నే ఇచ్చి రాజ‌కీయ స‌న్యాసం తీసుకుంటాన‌ని అధికార ప‌క్షానికి బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ స‌వాల్ చేశారు. అసెంబ్లీలో నేడు ప్ర‌శ్నోత్త‌రాల కార్య‌క్ర‌మాన్ని ర‌ద్దు చేసి రైతుభ‌రోసాపై స్వ‌ల్ప‌కాలిక చ‌ర్చ నిర్వ‌హించారు.. దీనిపై కేటీఆర్ మాట్లాడుతూ, అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు రుణాలు తెచ్చుకోండి అని ఇదే రేవంత్ రెడ్డి అన్నార‌న్నారు. డిసెంబ‌ర్ 9న రుణ‌మాఫీపై మొద‌టి సంత‌కం పెడుతా అన్నార‌ని,. ఏక‌కాలంలో ఒక‌టే పెన్ స్ట్రోక్‌తో రుణ‌మాఫీ చేస్తా అని చెప్పార‌ని వివ‌రించారు. డిసెంబ‌ర్ 7న స్టేట్ లెవ‌ల్ బ్యాంక‌ర్స్ మీటింగ్‌లో రుణ‌మాఫీ కోసం రూ. 49 వేల 500 కోట్లు అని వెల్ల‌డించార‌ని అంటూ ఒక్క సంవ‌త్స‌రం క‌డుపు క‌ట్టుకుంటే రుణమాఫీ చేసేస్తాం. రూ. 40 వేల కోట్లు క‌ట్టేస్తాం అని స్వ‌యంగా రేవంత్ ప్ర‌క‌టించార‌ని గుర్తు చేశారు.

ఇక ఈ రుణ మాఫీ లెక్క‌లు గురించి ప్ర‌స్తావిస్తూ, సీఎం రూ. 40 వేల కోట్లు అంటే.. కేబినెట్‌కు వ‌చ్చే వ‌ర‌కు రూ. 31 వేల కోట్లు, బ‌డ్జెట్‌కు వ‌చ్చేస‌రికి రూ. 26 వేల కోట్లు అయింద‌న్నారు కెటిఆర్. మొన్న జ‌రిగిన‌ పాల‌మూరు విజ‌యోత్స‌వ స‌భ‌లో రూ. 19 వేల కోట్లు అని సీఎం చెప్పార‌న్నారు.

ప్ర‌భుత్వానికి స‌వాల్ …

ఈ ప్ర‌భుత్వాన్ని స‌వాల్ చేస్తున్నాం.. ఈ రాష్ట్రంలో ఏ ఊరికైనా పోదాం.. కొండారెడ్డిప‌ల్లే, సిరిసిల్ల‌, పాలేరు పోదాం.. వాళ్ల ఇష్టం. ఏ ఒక్క ఊరిలో నైనా వంద శాతం రుణ‌మాఫీ జ‌రిగింద‌ని చెబితే స్పీక‌ర్ ఫార్మాట్‌లో రాజీనామా వెంట‌నే ఇచ్చి రాజ‌కీయ స‌న్యాసం తీసుకుంటాం. ఈ ర‌క‌మైన బుకాయింపు, మోసం ప్ర‌భుత్వానికి మంచిది కాదు. రుణ‌మాఫీ చేయ‌కుండా త‌ప్పించుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు అని కాంగ్రెస్ స‌ర్కార్‌పై కేటీఆర్ మండిప‌డ్డారు.

ఇక ఎన్నిక‌ల ప్ర‌చారంలో రైతుబంధు గురించి మాట్లాడుతూ, రైతుబంధు ఎందుకు ఆగిపోత‌ది అని రేవంత్ రెడ్డి అన్నార‌ని కెటిఆర్ చెప్పారు… ఆ ప‌థ‌కం ఆపేందుకు హౌలాగాళ్ల‌మా అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించార‌న్నారు. మ‌రి వాన‌కాలం రైతుబంధు ఎందుకు ఎగ్గొట్టార‌ని రేవంత్ ను స‌భ‌లో నిల‌దీశారు కెటిఆర్.
తాము ప్ర‌భుత్వంలో ఉండ‌గా, ఒక పంట కాదు మూడు పంట‌ల‌కు రైతుబంధు ఇవ్వాల‌ని రేవంత్ రెడ్డి చేసిన డిమాండ్ ను ప్ర‌స్తావిస్తూ, తాము కూడా మూడు పంట‌ల‌కు ఇవ్వాల‌ని డిమాండ్ చేస్తున్నామ‌న్నారు. . కౌలు రైతుకు, భూ య‌జ‌మానికి రైతుబందు ఇస్తామ‌న్నారు. త‌ప్ప‌కుండా ఇచ్చిన హామీని నిల‌బెట్టుకోవాల‌ని స‌భ‌లో కోరారు. . మొద‌టి వంద రోజుల్లోనే రైతుభ‌రోసా ఇస్తామ‌ని చెప్పి మాట నిల‌బెట్టుకోలేద‌ని,. అప్పుడేమో అంద‌రికి అని ఇప్పుడేమో కొంద‌రికి అని కోత‌లు పెట్టార‌ని కెటిఆర్ ఎత్తి పోడిచారు.

- Advertisement -

రైతు భ‌రోసార‌కు బ‌డ్జెట్‌లో రూ. 15 వేల కోట్లు కేటాయించార‌ని అంటూ . 70 ల‌క్ష‌ల మంది రైత‌న్న‌ల‌కు రూ. 23 వేల కోట్లు కావాల‌న్నారు. దీంతో రైతుబంధు కోత‌ల‌కు సిద్ద‌ప‌డ్డ త‌ర్వాత‌నే కేబినెట్ స‌బ్ క‌మిటీ వేశార‌న్నారు కెటిఆర్. రైతుబంధుపై మంత్రివ‌ర్గ ఉప‌సంఘం వేసి టైం పాస్ చేస్తున్నార‌ని ఆరోపించారు కెటిఆర్ . వాన‌కాలం రైతుబంధు ఎగ్గొట్టిన‌ట్టే.. ఇప్పుడు కూడా రైతుబంధు ఎగ్గొట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. . మేనిఫెస్టోలో కోత‌ల గురించి ఎందుకు చెప్ప‌లేద‌ని కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని నిల‌దీశారు . ఈ రాష్ట్రంలో కోటి పైచిలుకు పాన్ కార్డులు ఉన్నాయ‌ని, . వీళ్ల‌కు క‌ట్ చేస్తామంటే ఎలా..? అంటూ నిల‌దీశారు.. భూమి ఉండి ఐటీ క‌ట్టే వాళ్ల‌కు కట్ చేస్తామంటే ఎలా..? అంటూ ప్ర‌శ్నించారు. ఈ కోత‌ల‌తో రైతుబంధు ప‌థ‌కానికి ఉరి వేయ‌బోతున్నారని త‌మ‌కు అనుమానం అని కేటీఆర్ పేర్కొన్నారు. భూమి ఉన్న ప్ర‌తి ఒక్క‌రికి రైతు బంధు ఇవ్వాల్సిదేన‌ని కెటిఆర్ స‌భ‌లో డిమాండ్ చేశారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement