హైదరాబాద్ – మూసి ప్రక్షాళన చేసిన నల్గొండకు నీళ్లు ఇస్తామంటే బావ, బావమరదులు అడ్డుపడుతున్నారంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అసెంబ్లీలో కెటిఆర్, హరీశ్ రావులపై మండి పడ్డారు.. నల్గొండ ప్రజలపై కోపం విషం ఇచ్చి చంపేయడంటూ వారిని కోరారు.. అసెంబ్లీలో రైతు బంధుపై జరిగిన చర్చలో కాళేశ్వరం నీళ్లపై మాజీ మంత్రి హరీష్ రావు, మంత్రి కోమటి రెడ్డి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.. నల్గొండ జిల్లాకు కాళేశ్వం నీరు చేరాయన్నాహరీశ్ వ్యాఖ్యాలపై సభలో గందగోళం ఏర్పడింది.
దీంతో మంత్రి కోమటి రెడ్డి సభలో మాట్లాడుతూ.. నల్గొండ జిల్లాలో కాళేశ్వరం నీళ్లు ఒక్క ఎకరానికి ఇచ్చినట్లు నిరూపించినా తాను రాజీనామా చేస్తానని మంత్రి అన్నారు. మాజీ మంత్రి హరీశ్ రావు ఏం మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. చర్చకు రావాలని హరీష్ రావు, కేటీఆర్ లకు సవాల్ విసిరిన కోమటిరెడ్డి నల్గొండకు నీళ్లు ఎవరు ఇచ్చారో అడగాలని ప్రశ్నించారు. నల్గొండ జిల్లాలో ఎకరాకు కాళేశ్వరం నీళ్లు ఇచ్చారని నిరూపిస్తే రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వల్లే ఏఎంఆర్బీ వచ్చిందని గుర్తు చేశారు.
బావ, మామ నల్గొండ ప్రజలను చంపేస్తారా..
నల్గొండకు నీళ్లు ఇవ్వకుండా బావ, మామ నల్గొండ ప్రజలను చంపేస్తారా? వాళ్ళని చంపేయండి అని మండిపడ్డారు మంత్రి వెంకటరెడ్డి.. సీఎం రేవంత్ రెడ్డి మూసీని సరిచేస్తున్నారన్నారు. అందుకు కూడా తన బావ, మామ అడ్డుపడుతున్నారని మంత్రి మండిపడ్డారు. ఎక్సైజ్ టెండర్లు ఒక ఏడాది ముందు పెట్టారు.. రూ.2 వేల కోట్లు ముందుగా వసూలు చేశారన్నారు. ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళాయో తెలీదన్నారు. తెలంగాణ వచ్చాక నష్టపోయిన జిల్లా నల్గొండ అని తెలిపారు. తెలంగాణ వస్తే దళితున్ని ముఖ్యమంత్రి చేస్తా అన్నారు కేసీఆర్… మాట తప్పారని తెలిపారు. పదేళ్ల కేసీఆర్ పాలన..వందేళ్లు వెనక్కి తీసుకెళ్ళారని కీలక వ్యాఖ్యలు చేశారు. కూలిపోయే ప్రాజెక్టులు మాత్రమే కట్టారన్నారు. ఇంటింటికి నీళ్లు ఇయ్యకపోతే ఓట్లు అడుగా అన్నావ్ అన్నారు. సిరిసిల్లకు పోదాం ఏ ఇంటికి నీళ్లు వస్తున్నాయో తెలుస్తుందన్నారు. నల్గొండ జిల్లా సూర్యాపేటకు వెళ్దాం అన్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు కట్టింది ఎవరు? అని ప్రశ్నించారు.
మిషన్ భగీరథలో అవినీతా…
మిషన్ భగీరథకు ఖర్చే రూ.28వేల కోట్లు అయిందని మాజీ మంత్రి హరీష్రావు తెలిపారు. అందులో రూ.50వేల కోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్ నేతలు ఎలా అంటారని ప్రశ్నించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యలు రికార్డుల నుంచి తొలగించాలని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ను డిమాండ్ చేశారు. నల్గొండకు ఏం చేయలేదు అనడం సరికాదని హరీష్రావు పేర్కొన్నారు. నల్గొండ చేసిన మేలును హరీశ్ గణాంకాలతో వివరించారు హరీశ్ రావు ..