హైదరాబాద్ – కాంగ్రెస్ లేకపోతే అసలు కెసిఆర్ ఎక్కడ అంటూ రేవంత్ రెడ్డి నిండు సభలో నిలదీశారు.. పార్టీలో చేర్చుకున్నాం, పదవులిచ్చాం..చివరకు కేంద్రంలో సైతం కెసిర్ కు మంత్రి పదవి ఇచ్చింది కూడా తామేనంటూ రేవంత్ చురకలంటించారు.. పొతిరెడ్డిపాడు పై మాట్లాడింది అప్పటి తమ పార్టీ సభ్యుడు , దివంగత నేత పి జనార్ధనరెడ్డి, అ సమయంలో ప్రభుత్వంలో ఉన్న టిఆర్ ఎస్ సభ్యులు నోరెందుకు మెదపలేదన్నారు..
దీనిపై హారీష్ ఘాటుగా స్పందిస్తూ ఆనాడు కాంగ్రెస్ పార్టీని గెలిపించిందే టీఆర్ఎస్ పార్టీ అని హరీశ్ రావు గుర్తు చేశారు. వైెస్ కు తమ వల్లే అధికారం వచ్చిందన్నారు… అయితే రాజశేఖర్ రెడ్డి పోతిరెడ్డిపాడుకు బొక్క పెట్టారని, దీంతో తామంతాద ఆనాడు బయటకు వచ్చామని, ఆ తర్వాత పులిచింతల ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పోరాటం చేశామని అన్నారు. పోతిరెడ్డిపాడుకు వ్యతిరేకంగా ఆ రోజు తెలంగాణ కాంగ్రెస్ కు చెందిన ఏ ఒక్కరూ మాట్లాడలేదని.. ఒక్క పీజేఆర్ మాత్రమే మాతో కలిసి గళమెత్తారని హరీశ్ రావు గుర్తు చేశారు.
రేవంత్ రెడ్డి సభను తప్పుదోవ పట్టిస్తున్నారని ఫైర్ అయ్యారు. ఆ రోజు టీఆర్ఎస్‌తో కలిసి కాంగ్రెస్ పోటీ చేసిందని.. మా పార్టీ వల్లనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని అన్నారు. కాంగ్రెస్ కేబినెట్‌లో టీఆర్ఎస్ ఉన్నా ఆరు కారణాలతో 14 నెలలకే ఆరుగురు మంత్రులు రాజీనామా చేశామని, నాతోపాటు పద్మారావు గౌడ్ ప్లకార్డులు పట్టుకొని సభలో పోరాటం చేశారని హరీశ్ రావు కౌంటర్ ఇచ్చారు. పోరాటాలు మేం చేస్తే…విజయాలు మీ ఖాతాలో వేసుకుంటారా అంటూ రేవంత్ పై ప్రశ్నల వర్షం కురిపించారు.. సభను, ప్రజలను తప్పుదొవ పట్టిస్తే చూస్తూ ఊరుకోబోమని హరీష్ హెచ్చరించారు..