Saturday, November 23, 2024

Assembly – సభలో జాబ్ క్యాలెండ‌ర్ ప్ర‌వేశ‌పెట్టిన ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ – హైద‌రాబాద్ – ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్‌పై ప్రకటన చేశారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ గత పదేళ్ల కాలంలో నోటిఫికేషన్ల జాప్యం, తరుచూ వాయిదాలు ఇబ్బందికరంగా మారాయన్నారు. గత ప్రభుత్వ పాలనలో నియామక ప్రక్రియ గందరగోళంగా మారిందన్నారు. గతంలో రెండుసార్లు గ్రూప్ 1 పరీక్ష రద్దయిందని తెలిపారు. తాము అధికారంలోకి రాగానే పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.

ఇప్పటికే టీజీపీఎస్సీని ప్రక్షాళన చేశామన్నారు. వివిధ పరీక్షలకు నోటిఫికేషన్లు ఇచ్చినట్లు చెప్పారు. అభ్యర్థుల కోరిక మేరకు గ్రూప్ 2 వాయిదా వేసినట్లు వెల్ల‌డించారు. . జాబ్ క్యాలెండర్‌ను నిన్న కేబినెట్ మీటింగ్‌లో ఆమోదించామ‌ని, ఆ జాబ్ క్యాలెండర్ 2024-25ని సభ్యులందరికీ పంపిణీ చేసిన‌ట్లు చెప్పారు.

- Advertisement -

నోటిఫికేషన్‌ విడుదల చేసే నెల, పరీక్షలు ఎప్పుడు నిర్వహించాలనే వివరాలతో పాటు నియామకాలు నిర్వహించే ఏజెన్సీ, ఉద్యోగానికి కావాల్సిన అర్హతల గురించి అందులో పొందుపర్చారు.

జాబ్‌ క్యాలెండర్‌ ప్రకారం

టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో గ్రూప్‌-1 పరీక్షలు అక్టోబరులో, గ్రూప్‌-2ను డిసెంబరులో, గ్రూప్‌-3 నవంబరులో నిర్వహించనున్నారు.

.వైద్యఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ల్యాబ్ టెక్నీషియన్, నర్సింగ్ ఆఫీసర్ నియామకాల కోసం సెప్టెంబర్‌లో నోటిఫికేషన్ విడుదల… నవంబర్‌లో పరీక్షలు.

ట్రాన్స్‌కోలోని వివిధ ఇంజినీరింగ్ ఉద్యోగాల కోసం అక్టోబర్‌లో నోటిఫికేషన్..వచ్చే ఏడాది జనవరిలో నియామక పరీక్షలు నవంబర్‌లో టెట్ నోటిఫికేషన్ విడుదల చేసి వచ్చే ఏడాది జనవరిలో పరీక్షలు

వివిధ శాఖల్లో గెజిటెడ్ ఉద్యోగాల కోసం వచ్చే ఏడాది జనవరిలో నోటిఫికేషన్ విడుదల.. ఏప్రిల్‌లో పరీక్షలు

వచ్చే ఏడాది ఫిబ్రవరిలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల .. ఏప్రిల్‌లో పరీక్షలు

ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నోటిఫికేషన్ .. మేలో పరీక్షలుగ్రూప్‌-1 మెయిన్స్ పరీక్ష వచ్చే ఏడాది జులైలో నిర్వహించనున్నారు

ఎస్సై, పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం వచ్చే ఏడాది ఏప్రిల్‌లో నోటిఫికేషన్ విడుదల చేసి ఆగస్టులో పరీక్షలు నిర్వహిస్తారు

డిగ్రీ కళాశాలల్లో అధ్యాపకులు, ఫిజికల్ డైరెక్టర్లు, లైబ్రేరియన్ పోస్టులకు వచ్చే ఏడాది జూన్‌లో నోటిఫికేషన్..సెప్టెంబర్‌లో పరీక్షలు

వచ్చే ఏడాది మేలో మరోసారి గ్రూపు2 నోటిఫికేషన్.. అక్టోబర్‌లో పరీక్షలు

వచ్చే ఏడాది జులైలో గ్రూప్‌-3 నోటిఫికేషన్ నవంబర్‌లో పరీక్షలు

సింగరేణిలో పలు ఉద్యోగాల కోసం వచ్చే ఏడాది జులైలో నోటిఫికేషన్.. నవంబర్‌లో పరీక్షలు

Advertisement

తాజా వార్తలు

Advertisement