Friday, December 20, 2024

Assembly – స్పీక‌ర్ వెల్ లోకి దూసుకెళ్లిన బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు … సభ వాయిదా

హైద‌రాబాద్ – మాజీ మంత్రి కేటీఆర్ పై ఫార్ములా-ఈ రేసు కేసు అక్రమమని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా నల్ల బ్యాడ్జీలు ధరించి ప్లకార్డుల ప్రదర్శన, నినాదాలతో అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. . దీనిపై చర్చించాలని పట్టుబడుతు నినాదాలకు దిగారు. బీఏసీ ఎజెండాలో లేని అంశంపై చర్చకు అవకాశమిచ్చేది లేదని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. కేటీఆర్ పై అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులను ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. ఫార్ములా ఈ-కారు రేసు అంశంపై సభలో చర్చ పెట్టాలని పట్టుబట్టారు. మరో వైపు ఆందోళన విరమించాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వారించినా బీఆర్ఎస్ సభ్యులు పట్టు వీడలేదు. ఈ స‌మ‌యంలోనే హ‌రీశ్ తో స‌హా కొంద‌రు బిఆర్ఎస్ ఎమ్మెల్య‌లు స్పీక‌ర్ వెల్ లోకి దూసుకెళ్లారు.. అక్క‌డ మార్ష‌ల్స్ వారిని అడ్డుకున్నారు.. దీంతో ఆక్క‌డ తోపులాట చోసుకుంది.. ఈ స‌మయంలోనే కొంద‌రు బిఆర్ఎస్ స‌భ్యులు స్పీక‌ర్ పైకి కాగితాలు విసిరారు.. దీంతో స‌భ‌లో గంద‌ర‌గోళం చోటు చేసుకుంది.. దీంతో స్పీక‌ర్ సభను 15 నిమిషాల పాటు వాయిదా వేశారు.

మండ‌లిలోనూ…

బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై అక్రమ కేసుకు నిరసనగా కౌన్సిల్ కి నలుపు చీర ధరించి మండలి కి ఎమ్మెల్యే కవిత స‌హా ఎమ్మెల్సీల‌తో క‌ల‌సి వ‌చ్చారు.. ఫార్ములా ఈ వ్యవహారం పై మండలి లో చర్చ జ‌ర‌గాల‌ని బిఆర్ఎస్ ప‌ట్టుబ‌ట్టింది.. స‌భ‌లో నినాదాల‌తో హోరెత్తించారు. సభ్యులు నినాదాలు మాని బిల్లుల చర్చపై పాల్గొనాలని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కోరినా బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు పట్టించుకోకపోవడంతో 15నిమిషాల పాటు స‌మావేశాన్ని వాయిదా వేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement