Saturday, September 21, 2024

Assembly పార్టీలు మారి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది మీరే… స‌బిత‌పై భ‌ట్టి ఫైర్

హైదరాబాద్ – పార్టీలు మారి, పరువు తీసి, మొత్తం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి ఇంకా ఆవేదన చెందుతున్నాం బాధపడుతున్నాం అంటే ఎట్లా అధ్యక్ష అని ఎమ్మెల్యే సబిత ఇంద్రారెడ్డిని ఉద్దేశించి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. అసెంబ్లీలో నేడు ఆయన మాట్లాడుతూ, ఏ మొహం పెట్టుకొని ఇంకా మాట్లాడుతున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సబితా ఇంద్రా రెడ్డి ని 2004 ముందు కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చారు. ఆ తర్వాత పార్టీ అధికారంలోకి రాగా ఆమెకు మంత్రి పదవిని ఇచ్చారు. 2009లో మళ్లీ టికెట్ ఇచ్చి మంచి పోర్ట్ పోలియోతో మంత్రిగా గౌరవించారు. దశాబ్ద కాలం పాటు అత్యంత ముఖ్యమైన మంత్రి పదవులు వారు అనుభవించారు. 2014లో కూడా వారికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. అదృష్టమో దురదృష్టమో 2014లో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోల్పోయింది.

ఆ సమయంలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పెద్ద హృదయంతో నన్ను ప్రతిపక్ష నేతగా నిర్ణయించింది. ఒక దళితుడిని ప్రతిపక్ష నేతగా ఈ రాష్ట్ర చరిత్రలో ఏ పార్టీ చేయలేదు.. మొట్టమొదటిసారి కాంగ్రెస్ పార్టీ చేసి అక్కడ కూర్చోబెట్టింది. దశాబ్ద కాలం మంత్రి పదవులు అనుభవించిన సబితా ఇంద్రా రెడ్డి నా వెనుక ఉండి నన్ను ఎల్ఓపిగా నిలబెట్టాల్సింది పోయి .. అధికారం కోసం పార్టీ మారారు. అప్పుడు నాతో సహా పలువురు నాయకులు వారి ఇంటికి వెళ్లి పోవద్దు అమ్మ అని అడిగాం. మీరు పోతే ఎల్ఓపి హోదా పోతుంది కాంగ్రెస్ పార్టీ పరువు పోతుంది కాంగ్రెస్ పార్టీలో అన్ని పదవులు అనుభవించారు ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు పార్టీ మీకు ఏం తక్కువ చేసింది కావాలంటే భవిష్యత్తులో ఇంకా చేస్తుంది మీ అబ్బాయికి కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ ఇచ్చింది ఆలోచన చేయండి అని పదే పదే బతిమిలాడితే ఒక్కసారి అయినా ఆలోచన చేశారా.. మీ అధికారం కోసం మీ స్వార్థం కోసం నాకు ఎల్ఓపి లేకుండా చేయడం కోసం టిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇవాళ మీరు ఆందోళన చెందుతున్నారు ఆవేదన చెందుతున్నారంటే అర్థం లేదు.. ఆవేదన చెందాల్సింది ఆందోళన చెందాల్సింది ఎవరు అధ్యక్ష మీరే చెప్పండంటూ భ‌ట్టి కోరారు…

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement