హైదరాబాద్ – అప్పులపై బిఆర్ ఎస్ నేతలు చేబుతున్నవన్నీఅబద్దాలేనని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు.. వివిధ కార్పొరేషన్ ల ద్వారా రుణాలు తీసుకున్న కెసిఆర్ ప్రభుత్వం వాటిని మాత్రం వెల్లడించడం లేదని చెప్పారు.. ఆర్థిక పరిస్థితిపై నేడు అసెంబ్లీలో నేడు జరిగిన స్వల్పకాలిక చర్చలో ఆయన మాట్టాడతూ, బిఆర్ఎస్ చేసిన అప్పులపై సుదీర్ఘంగా వివరణ ఇచ్చారు.. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన అప్పులు రూ 52 వేల కోట్లేనని స్పష్టం చేశారు.
అబద్ధాలు చెప్పడం బీఆర్ఎస్‌కు వెన్నతో పెట్టిన విద్య అని,తిమ్మిని బమ్మిని చేయడంలో హరీశ్ రావు సిద్దహస్తుడంటూ విరుచుకుపడ్డారు భట్టి .. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేశామని పేర్కొన్నారు. రాష్ట్రం మొత్తం అప్పు రూ.6 లక్షల 71 వేల కోట్లు అప్పు ఉందని ఆయన తెలిపారు. అప్పులపై హరీష్‌రావు అనేక ఆరోపణలు చేశారని.. ఉన్నవి లేనట్టు, లేనివి ఉన్నట్లు చెప్పడం ఆయనకే చెల్లిందని ఫైర్ అయ్యారు. కెసిఆర్ ప్రభుత్వం తమకు వారసత్వంగా ఇచ్చిన పెండింగ్ బిల్లుల విలువే రూ.40వేల 150 కోట్లు ఉన్నాయని అన్నారు. అప్పులు, పెండింగ్ బిల్లులు కలిపితే రూ.7లక్షల 19వేల కోట్ల అప్పు ఉందన్నారు. ఇక బిఆర్ ఎస్ ప్రభుత్వం తమ పదేళ్ల హాయంలో రూ .7 లక్షల కోట్లకు పైగా అప్పుల చేశారరన్నారు. కానీ వారు మాత్ర నాలుగు లక్షల కోట్లు మాత్రమే అప్పుచేశారని చెప్పుకుంటున్నారని పేర్కొన్నారు..
తాము అధికారంలోకి వచ్చాక రూ.52 వేల కోట్లు అప్పు చేశామని తెలిపారు. తప్పుడు లెక్కలు చెప్పి సభను తప్పుదోవ పట్టించారని బీఆర్ఎస్ అంటోందని.. సభలోనే కాదు బయట కూడా ఏది పడితే అది మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. కాళేశ్వరంపై చెసిన అప్పులు తాము తీరుస్తున్నామని తెలిపారు.. అలాగే ఫిషరీస్ కార్పొరేషన్ తో పాటు ఇతర కార్పొరేషన్ ల ద్వారా సేకరించిన అప్పలను తమ ప్రభుత్వం క్రమ పద్దతిలో చెల్లిస్తున్నామన్నారు.. ఇప్పటి వరకు రూ .26 వేల కోట్ల రూపాయిల అప్పులు తీర్చామన్నారు.
వాళ్ల లాగా తాము ప్రభుత్వం ఆస్తులను అమ్ముకోలేదంటూ బిఆర్ఎస్ పార్టీకి చురకలంటించారు. ఎయిర్‌పోర్టు,, ఓఆర్ఆర్ లీజుకు ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. ఏ ఆస్తులను అమ్మకుండానే హామీలను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. పెండింగ్ బిల్లులు, బకాయిలను క్లియర్ చేసుకుంటూ వస్తున్నామని తెలిపారు. పదేళ్ల పాటు స్కూళ్లలో డైట్ బిల్లలు కూడా పెంచలేదు. తాము డైట్ బిల్లు పెంచామని.. యంగ్ ఇండియా స్కూల్స్ ఏర్పాటు చేస్తుమని అన్నారు. కాగ్ రిపోర్ట్ లో కూడా బిఆర్ఎస్ ప్రభుత్వం కార్పొరేషన్ అప్పులను వెల్లడించడం లేదని ఈ సందర్భంగా భట్టి గుర్తు చేశారు.