ఆంధ్రప్రభ స్మార్ట్ – హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలకు షెడ్యూల్ ఖరారు అయ్యింది. సోమవారం అసెంబ్లీ బిజినెస్ అడ్వయిజరీ కమిటీ సమావేశం జరిగింది. మొత్తం ఎనిమిది రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. జూలై 25న ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క రాష్ట్ర బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశ పెట్టనున్నారు. జూలై 31 ద్రవ్య వినిమయ బిల్లుకు గవర్నర్ అమోదం తెలపనున్నారు. సభలో జాబ్ క్యాలెండర్ వంటి కీలక అంశాలు చర్చించే అవకాశం ఉంది.
సమావేశానికి హాజరైన నేతలు
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ చాంబర్‌లో బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్‌లు, బీఆర్ఎస్ నుంచి హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, బీజేపీ నుంచి మహేశ్వర్ రెడ్డి, సీపీఐ నుంచి కూనంనేని సాంబశివరావు, ఎంఐఎం నుంచి బలాల్ హాజరయ్యారు.