తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో అధిక సీట్లు గెలిచేందుకు బీజేపీ వ్యూహం రచించింది. రాష్ట్రంలో బీజేపీ పెద్దల పర్యటనకు ప్రణాళికలు రూపొందించింది. బీజేపీ లోక్‌సభ ఎన్నికల ప్రచారాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అస్సోం సీఎం హిమంత విశ్వ శర్మ విజయ సంకల్పయాత్రను ప్రారంభించనున్నారు.
భారతీయ జనతా పార్టీ పార్లమెంటు ఎన్నికలకు క్షేత్రస్థాయిలో శ్రేణులను ఏకధాటిపై తేవడం కోసం, పార్టీ విధివిధానాలను, తమ వైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్లడం లక్ష్యంగా విజయ సంకల్ప యాత్ర పేరిట బస్సు యాత్రను ఇవా బాసర పుణ్యక్షేత్రం నుండి ప్రారంభిస్తున్నారు. అదిలాబాద్ పెద్దపెల్లి నిజాంబాద్ పార్లమెంటు స్థానాలను అనుసంధానిస్తూ 21 శాసనసభ స్థానాల్లో సుమారు 310 కిలోమీటర్ల మేర బస్సు యాత్ర కొనసాగుతుంది. ఈ కార్యక్రమానికి అశోక్ ముఖ్యమంత్రి హిమంత విశ్వ శర్మ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు.
ఉదయం బాసర సరస్వతి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. యాత్రను ప్రారంభిస్తారు. అనంతరం అక్కడనుండి నేరుగా భైంసాకు చేరుకుంటారు. ఎస్. ఎస్. జిన్నింగ్ ఫ్యాక్టరీ ఆవరణలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ముఖ్య అతిథిగా అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ హాజరుకానున్నారు. మధ్యాహ్న భోజనం అనంతరం యాత్ర మొదలవుతుంది. కల్లూరులో, నర్సాపూర్ (జి), దిలావర్పూర్ రోడోషో ముగించుకున్న అనంతరం నిర్మల్ జిల్లా కేంద్రానికి చేరుకుంటారు. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో అక్కడ బహిరంగసభ జరుగు తుంది. రాత్రి అక్కడే బసచేస్తారు.