Tuesday, November 19, 2024

Asifabad జిల్లా ఎస్పీని బదిలీ చేయండి… ఈసీ కి ప్రవీణ్ కుమార్ లేఖ

అధికార బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోనేరు కోనప్పకు అనుకూలంగా వ్యవహరిస్తున్న కుమురం భీమ్ అసిఫాబాద్ జిల్లా ఎస్పీ కే.సురేష్ కుమార్ ను తక్షణమే ఎన్నికల విధుల నుంచి తప్పించాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. గత రాత్రి  కాగజ్ నగర్  పట్టణంలో బీఆర్ఎస్,బీఎస్పీ శ్రేణుల మధ్య పరస్పర ఘర్షణలో పోలీసులు కేసులు నమోదు చేయడంపై పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లా ఎస్పీ బీఎస్పీ నాయకులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు.

.బీఎస్పీ నాయకులపై పోలీసులు కేసులు నమోదు వెనుక కేసీఆర్,కేటీఆర్ ల హస్తం ఉందని ఆరోపించారు. ఎమ్మెల్యే కోనేరు కోనప్ప బెదిరింపులపై పోలీసులకు ఫిర్యాదు చెస్తే పట్టించుకోవడం లేదన్నారు. ఎఫ్ఐఆర్ నమోదు కోసం స్టేషన్ ముందు ధర్నా చేసే దుస్థితి ఏర్పడిందన్నారు.తాను స్వయంగా డీజీపితో మాట్లాడితే తప్ప, కోనప్పపై, ఆయన అనుచరులపై ఎఫ్ఐఆర్ నమోదు కాలేదన్నారు. 26 ఏళ్ల పోలీస్ సర్వీస్ లో ప్రజల సంక్షేమం కోసం, శాంతిభద్రతలు కాపాడడంలో తనపై మూడుసార్లు హత్యాయత్నం జరిగిందన్న ఆయన అటువంటి తనపై,తన కుమారుడిపై ఎమ్మెల్యే కోనప్ప ప్రోద్బలంతో హత్యయత్నం, దొంగతనం కేసు నమోదు చేయడం అక్రమమన్నారు.ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగేందుకు జిల్లా ఎస్పీని బదిలీ చేసి,మరో ఐపీఎస్ అధికారితోపాటు ఎన్నికల అబ్జార్వర్ లను నియమించి పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలని కోరారు.

మాదిగల ఓట్ల కోసమే మోడీ ఎస్సీ వర్గీకరణ జపం

- Advertisement -

కేంద్రంలో బీజెపి అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఎస్సీ వర్గీకరణ చేస్తామన్న హామీ ఏమైందని ప్రధాని మోడీని ప్రశ్నించారు. ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని మాయమాటలు చెప్పి, అధికారంలోకి రాగానే వర్గీకరణ బిల్లును పార్లమెంటులో ఎందుకు ప్రవేశపెట్టలేదని అన్నారు.ఎస్సీ వర్గీకరణ అంశాన్ని బిజెపి అవకాశవాద రాజకీయాలకు వాడుకుంటుందని విమర్శించారు. మాదిగల ఓట్ల కోసం ప్రధాని మోడీ ఎస్సీ వర్గీకరణ అంశాన్ని తెరపైకి తెచ్చి కేంద్రంలో మరో కమిటీ వేస్తామని ప్రకటించడమంటే మాదిగలను మరోసారి మోసం చేయడమేనని విమర్శించారు. .

Advertisement

తాజా వార్తలు

Advertisement