ఆసిఫాబాద్ రూరల్ జూన్ 29 (ప్రభ న్యూస్) కోమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయం జిల్లా పోలీస్ కార్యాలయం.బిఅర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంబొత్సవం, జల్ జంగిల్ జామీన్ కోసం అశువులు బాసిన అమర వీరుడు కోమరంభీం.మాజీ మంత్రి కొట్నాక భీంరావ్ విగ్రహల ఆవిష్కరణ, గిరిజన రైతులకు పోడు భూముల పట్టాలు పంపిణీ కార్యక్రమంలో.భాగంగా. జిల్లాకు శనివారం రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జిల్లాకు రానున్న నేపథ్యంలో జిల్లా కేంద్రంలో నిర్వహించే భహిరంగ సభకు భారీ జన సమీకరణ కోసం జిల్లా నేతలు గత రెండు రోజులుగా కృషి చేస్తున్నారు. గత నాలుగు రోజులుగా వర్షం రావడం బుధవారం సాయంత్రం వర్షం కాస్త తగ్గడంతో అధికారులు నాయకులకు ఉరాటం కలిగింది,. బహిరంగ సభ స్థలం వద్ద టెంట్ నిర్మాణంలో జర్మనీ రేయిన్ ప్రూఫ్ టెంట్లను అమర్చారు. నిరసన కారులు ముఖ్యమంత్రి కాన్వాయ్ కు ఆటంకం కలగకుండా హెలిప్యాడ్ నుంచి నూతన కలెక్టర్ కార్యాలయం మీదుగా కోమరంభీం చౌక్ వరకు మార్గంలో రోడ్డుకు బారికేడ్లు అమర్చారు.సభకు సంబంధించిన పనులను రాత్రి పగలు యుద్ధ ప్రాధి పధికపై పూర్తి చేసారు.
.సభ మైదానంలో పనులను ఎమ్మెల్సీ దండే విట్ఠల్ జడ్పీ చైర్మన్ కోవ లక్ష్మీ పార్టీ జిల్లా అధ్యక్షుడు సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కొనప్ప. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు.జడ్పీటిసి అరిగెల నాగేశ్వరరావు ఎంపిపి మల్లికార్జున్ లు స్వయంగా పర్యవేక్షించారు.