ఢిల్లీ – తెలంగాణకు రైల్వే శాఖ కేటాయింపులపై సరైన వివరాలు, లెక్కలు తెలుసుకుని మాట్లాడాలని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మంత్రి కెటిఆర్ ని కోరారు.. హైదరాబాద్ కు వచ్చిన అయన సికింద్రాబాద్ స్టేషన్ ను పరిశీలించారు.. అలాగే కావచ్ ఎక్స్ లెన్సీ సెంటర్ ను వీక్షించారు.. అనంతరం రైల్వే శాఖ అధికారులతో సమావేశం అయ్యారు.. ఈ సందర్బంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ, ..రూ. 4,418 కోట్లను కేటాయించామని వెల్లడించారు. రాష్ట్రంలో రూ. 29,581 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టు పనులు పురోగతిలో ఉన్నాయని, మరో 39 రైల్వే స్టేషన్లు ఆధునీకరిస్తామన్నారు. ఉమ్మడి రాష్ర్టంలో ఈ కేటాయింపులు రూ. 886 కోట్లేనని గుర్తు చేశారు. భద్రాద్రి కొత్త లైన్ డిపిఆర్ సిద్దంగా ఉందని తెలిపారు.
కేసీఆర్ ప్రభుత్వం నుంచి కేంద్రానికి సరైన సహకారం అందడంలేదని విమర్శించారు. తెలంగాణలో రైల్వే లైన్ల అభివృద్ధికి కేంద్రం భారీగా నిధులు కేటాయిస్తోందని మంత్రి చెప్పారు. రాష్ట్రంలో వేగన్ తయారీ కేంద్రం ఏర్పాటు కోసం రూ. 521 కోట్లు కేటాయించినట్లు అశ్విని వైష్ణవ్ చెప్పారు. ఇందుకు 160 ఎకరాలు స్థలం అవసరంకాగా.. ప్రభుత్వం 150 ఎకరాలు మాత్రమే ఇచ్చిందని చెప్పారు. తెలంగాణలో మరో 20 ఎంఎంటీఎస్ కొత్త ట్రైన్లు నడుస్తాయని,సికింద్రాబాద్ నుండి మేడ్చల్ మధ్య అవి పరుగులు పెడతాయన్నారు. తెలంగాణకు రెండు ఎక్స్ లెన్సీ కేంద్రాలు కేటాయించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. అలాగే వందేభారత్ రైలు ఇప్పటికే నడుస్తునదని, మరికొన్ని రైళ్లు కూడా త్వరలోరానున్నాయని వెల్లడించారు.