Monday, November 25, 2024

Ashadam – బోనం ఎత్త‌నున్న భాగ్య‌న‌గ‌రం.. నెల రోజులపాటు ఊరూర సంబురం..

బోనాల పండుగ‌కు హైద‌రాబాద్ రెడీ అవుతోంది. తొలి బోనం ఎత్తేందుకు ఆడ‌ప‌డుచులు ఆరాటంగా ఉన్నారు. ఇక‌.. గోల్కొండ కోటలోని జగదాంబిక ఆలయంలో ఆషాఢ‌మాసం ఆదివారం బోనాల ఉత్సవం ప్రారంభంకానుంది. కాగా, ఈ ఏడాది జ్యేష్ఠమాస అమావాస్య జులై 5వ తేదీ శుక్రవారం వస్తుంది.. అంటే జులై 6వ తేదీ శనివారం నుంచి ఆషాఢ‌మాసం ప్రారంభమవుతుంది. దీంతో జులై 7న ఆషాఢమాసం మొదటి ఆదివారం భాగ్యనగరంలో బోనాల సంబురాలు ప్రారంభం కానున్నాయి.


జులై 7నుంచి ఉత్సవాలు ప్రారంభం
తొలి బోనం గోల్కొండ జ‌గ‌దాంబిక‌కు
రెండో బోనం బ‌ల్కంపేట ఎల్ల‌మ్మ‌కు
మూడో బోనం సికింద్రాబాద్ ఉజ్జ‌యినీకి
ఆగ‌స్టు 4న ముగియ‌నున్న ఉత్స‌వం

గోల్కొండ‌ ఎల్లమ్మ ఆలయంలో తొలి పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి, లాల్ దర్వాజ మహంకాళి ఆలయాల్లో ప్రతి గురు, ఆదివారాల్లో నెల రోజుల పాటు అమ్మ‌కు భ‌క్తితో బోనం చెల్లిస్తారు. మొక్కులు స‌మ‌ర్పించుకుంటారు.

= జులై 7వ తేదీ ఆదివారం నుంచి గోల్గొండ జగదాంబికకు తొలిబోనం సమర్పించడంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి.
= 11వ తేదీ గురువారం రెండో పూజ
= 14వ తేదీ ఆదివారం మూడో పూజ
= 18వ తేదీ గురువారం నాలుగో పూజ నిర్వహిస్తారు.
= 21వ తేదీ ఆదివారం అయిదో పూజ ఉంటుంది.
= 25వ తేదీ గురువారం ఆరో పూజ
= 28వ తేదీ ఆదివారం ఏడో పూజ నిర్వ‌హిస్తారు.
= ఆగస్ట్ 1వ తేదీ గురువారం ఎనిమిదో పూజ
= 4వ తేదీ ఆదివారం తొమ్మిదో పూజ చేస్తారు.
= అంటే.. జులై 7వ తేదీన ఆదివారం ప్రారంభమయ్యే బోనాల జాత‌ర మ‌హోత్స‌వం ఆగస్టు 4వ తేదీ ఆదివారంతో ముగుస్తుంది.

- Advertisement -

ఇంటి ఆడ‌బిడ్డ‌గా భావించి..

ఆషాఢ‌మాసంలో అమ్మవారు పుట్టింటికి వెళ్తార‌ని, అందుకే తమ ఇంటి ఆడబిడ్డగా భావించి భక్తిశ్రద్ధలతో పూజించి నైవేద్యాలు సమర్పిస్తారు. అప్పట్లో బోనాల పండుగ ప్రారంభం సమయంలో దుష్టశక్తులను పారదోలేందుకు నాగలిని బలి ఇచ్చేవారు. ఇప్పుడు.. దున్న‌డానికి బదులు కోళ్లు, మేకలను పెంచుతున్నారు. బోనాలు మోసిన మహిళలు అమ్మవారి అనుగ్రహం పొందుతారని భక్తులు విశ్వసిస్తారు. అందుకే బోనాలు మోసిన మహిళలు ఆలయానికి చేరుకోగానే పాదాలపై నీళ్లు చల్లి మొక్కులు చెల్లించుకుంటారు.

బోనాల వ‌రుస క్ర‌మం ఇలా..

మొదటి బోనం గోల్కొండ‌లోని జగదాంబిక అమ్మవారి ఆలయంలో.. రెండో బోనం బల్కంపేటలోని రేణుకా ఎల్లమ్మ ఆలయంలో.. మూడో బోనం సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో సమర్పిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement