Saturday, September 21, 2024

Asembly – పదేళ్ల పాలనలో మీరేం చేశారు .. కెటిఆర్ పై సీతక్క గరం గరం

ఉద్యోగాలు ఎందుకివ్వలేదు
చిరుద్యోగులకు పెన్షన్​ తీసేశారi
ధరణి పేరుతో పేదలకు పట్టాలు ఇవ్వలేదు
ఔట్​ సోర్సింగ్​ జాబ్స్​ లేకుండా చేశారు
అసెంబ్లీలో మంత్రి సీతక్క ఆగ్రహం దళితులకు సీఎం హామీ తుంగలో తొక్కారు
సామాజిక న్యాయం గురించి బీఆర్​ఎస్​ మాట్లడొద్దు
ఆ అర్హత వారికి లేదన్న మంత్రి శ్రీధర్​బాబు

ఇంటింటికి ఉద్యోగం పేరుతో బీఆర్ఎస్ ప్రజలను పదేళ్లపాటు మోసం చేసిందని మంత్రి సీతక్క విమర్శించారు. పదేళ్లపాటు ఓయూకు వెళ్లలేకపోయారని ఎద్దేవా చేశారు. పదేళ్లు అధికారంలో ఉండి మీరు ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదు? అని ప్రశ్నించారు. ఆశ వర్కర్లు, అంగన్వాడీల పెన్షన్లను బీఆర్ఎస్ ప్రభుత్వం తొలగించిందని ఆరోపించారు. చిరు ఉద్యోగుల తల్లిదండ్రుల పెన్షన్ తీసేసింది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే అన్నారు. ధరణి పేరుతో పేదలకు పట్టాలు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారని ఆరోపించారు. బీఆర్ఎస్ వేధింపులు తట్టుకోలేకనే ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపించారని పేర్కొన్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా వేతనాలు ఇవ్వలేదని విమర్శించారు.

సామాజిక న్యాయం గురించి మాట్లాడే అర్హత లేదు: శ్రీధర్ బాబు

దళితుడిని సీఎం చేస్తానని హామీ ఇచ్చి.. అధికారంలోకి వచ్చాక ఆ హామీని తుంగలో తొక్కిన బీఆర్ఎస్‌కు సామాజిక న్యాయం గురించి మాట్లాడే అర్హత లేదని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement