Monday, November 18, 2024

లాక్‌డౌన్ పొడిగించకూడ‌దు : అస‌దుద్దీన్ ఒవైసీ

తెలంగాణ కేబినెట్ కాసేప‌ట్లో స‌మావేశం జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో.. లాక్‌డౌన్ పొడిగించ‌వ‌ద్ద‌ని ఎంఐఎం అధినేత అస‌దుద్దీన్ ఒవైసీ ట్విట్ట‌ర్‌లో రాష్ట్ర ప్ర‌భుత్వానికి ప‌లు సూచ‌న‌లు చేశారు. క‌రోనా క‌ట్ట‌డికి లాక్‌డౌన్‌ ప‌రిష్కారం కాదని, జ‌న స‌మూహాల‌ను త‌గ్గించాలంటే సాయంత్రం 6 గంట‌ల నుంచి క‌ర్ఫ్యూ విధించాల‌ని చెప్పారు. కొవిడ్ కేసులు ఉన్న‌చోట మినిలాక్‌డౌన్ పెట్టాల‌ని సూచించారు. రాష్ట్రంలోని 3.5 కోట్ల మంది ప్ర‌జ‌లు కేవ‌లం నాలుగు గంట‌ల లాక్‌డౌన్‌ స‌డ‌లింపు స‌మ‌యంలో అన్ని ప‌నుల‌ను చూసుకోలేర‌ని ఆయ‌న చెప్పారు. లాక్‌డౌన్ కార‌ణంగా కేసులు త‌గ్గ‌లేద‌ని, రాష్ట్రంలో అంత‌కు ముందు నుంచే కేసులు త‌గ్గుముఖం ప‌ట్టడం ప్రారంభ‌మ‌యింద‌ని చెప్పుకొచ్చారు. క‌రోనా, పేద‌రికం, పోలీసుల వేధింపుల‌తో ప్ర‌జ‌ల‌కు ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయ‌ని అన్నారు. క‌రోనా క‌ట్ట‌డిని శాంతి భ‌ద్ర‌త‌ల స‌మ‌స్య‌గా మార్చ‌కూడ‌ద‌ని ఆయ‌న చెప్పారు.

రాష్ట్రంలోని 3.5 కోట్ల మంది ప్ర‌జ‌లు కేవ‌లం నాలుగు గంట‌ల లాక్‌డౌన్‌ స‌డ‌లింపు స‌మ‌యంలో అన్ని ప‌నుల‌ను చూసుకోలేర‌ని ఆయ‌న చెప్పారు. లాక్‌డౌన్ కార‌ణంగా కేసులు త‌గ్గ‌లేద‌ని, రాష్ట్రంలో అంత‌కు ముందు నుంచే కేసులు త‌గ్గుముఖం ప‌ట్టడం ప్రారంభ‌మ‌యింద‌ని చెప్పుకొచ్చారు. క‌రోనా, పేద‌రికం, పోలీసుల వేధింపుల‌తో ప్ర‌జ‌ల‌కు ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయ‌ని అన్నారు. క‌రోనా క‌ట్ట‌డిని శాంతి భ‌ద్ర‌త‌ల స‌మ‌స్య‌గా మార్చ‌కూడ‌ద‌ని ఆయ‌న చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement