Friday, November 22, 2024

ఈ కామర్స్ కు షరతులతో కూడిన అనుమతులు

ఈ కామ‌ర్స్ కు ష‌ర‌తుల‌తో కూడిన అనుమతులు ఉన్నాయని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. కేవ‌లం కోవిడ్ రోగుల‌కు ఆహారం, మందుల స‌ర‌ఫ‌రాకు అనుమ‌తి ఉందన్నారు. జోమాటో, స్విగ్గి లాంటి కంపెనీలకు పోలీసులు స‌హ‌కరిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర‌వ్యాప్తంగా ధాన్యం కొనుగోలుకు ఆటంకం లేకుండా చూస్తున్నామన్నారు. రైతు వ్వ‌వ‌సాయ ప‌నుల‌కు ఎక్కడా ఆటంకం లేదన్నారు. చిన్న ప‌ట్ట‌ణాల నుంచి హైద‌రాబాద్ వ‌ర‌కు లాక్‌ డౌన్ స‌ర్ధవంతంగా కొన‌సాగుతుందని తెలిపారు. అన‌వ‌స‌రంగా రోడ్ల‌మీద‌కు రావొద్దని ప్ర‌జ‌ల‌కు డీజీపీ విజ్ఞ‌ప్తి చేశారు. ప్ర‌జ‌లంద‌రూ పోలీసుల‌కు స‌హ‌క‌రించాల‌న్నారు. లాక్‌డౌన్ వేళ‌ల్లో బ‌య‌ట‌కు వ‌చ్చే వాహ‌నాల‌ను సీజ్ చేసి, క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు. ఇత‌ర రాష్ట్రాల నుంచి వ‌చ్చేవారికి ఈ పాసు తప్ప‌నిస‌రి అని స్పష్టం చేశారు. ఈపాసు ఎక్క‌డ తీసుకున్నా అనుమతిస్తామని, పాసుల‌ను దుర్వినియోగం చేయ‌కూడ‌దని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement