టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహించే గ్రూప్2 పరీక్షలను వాయిదా వేసేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయినందున వాయిదా వేయలేమని స్పష్టం చేసింది.
డిసెంబర్ 16న రైల్వే పరీక్ష ఉందని, ఒకే రోజు గ్రూప్-2, రైల్వే పరీక్షలు ఉన్నందున పరీక్షను వేరే తేదీకి మార్చాలని కోరుతూ పలు పిటిషన్లు దాఖలయ్యాయి.
అయితే, గ్రూప్-2 వాయిదా వేయడం వల్ల లక్షల మంది అభ్యర్థులు నష్టపోతారని టీజీపీఎస్సీ న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇప్పటికే అభ్యర్థులంతా హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నట్లు తెలిపారు.
దీనిని పరిగణనలోకి తీసుకున్న ఉన్నత న్యాయస్థానం పరీక్షను వాయిదా వేసేందుకు నిరాకరిస్తూ పిటిషన్లు కొట్టివేసింది.