Tuesday, November 19, 2024

Sithakka Fire : అహంకారమే బీఆర్‌ఎస్‌ ఓటమికి కారణం… మంత్రి సీతక్క

అహంకారమే బీఆర్‌ఎస్‌ ఓటమికి కారణమైందని మంత్రి సీతక్క దుయ్యబట్టారు. వేములవాడ రాజన్నను దర్శించుకున్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. మాజీ మంత్రి కేటీఆర్ పై ఫైర్​ అయ్యారు సీతక్క. కేటీఆర్​కు మైండ్​ బ్లాకైందని, అందుకే విధ్వంస రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.

అధికారం లేకుండా కేటీఆర్‌ ఉండలేకపోతున్నారని దుయ్యాబట్టారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో రాజన్న ఆలయం అభివృద్ధిలో వివక్షకు గురైందని, మా ప్రభుత్వంలో తప్పకుండా అభివృద్ధి చేస్తామన్నారు.గత పాలకులు పదేండ్లపాటు సామాజిక మాధ్యమాల్లో ఉన్నది లేనట్టుగా చూపి కాలం గడిపారని విమర్శించారు. అందుకే ప్రజలు వారిని తిరస్కరించి తమకు అధికారం కట్టబెట్టారని చెప్పారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలకు వస్తున్న ప్రజా ఆదరణను చూసి ఓర్వలేక మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తప్పుడు మాటలను ప్రజలు ఇక నమ్మని పరిస్థితి వచ్చిందని, సోషల్‌ మీడియాలో తప్పుడు ఆరోపణలు చేస్తే ప్రజలు గమనిస్తున్నారని వెల్లడించారు. సర్పంచుల వేల బిల్లులు పెండింగ్ పట్టిందెవరుని ప్రశ్నించారు. తాము సక్రమంగా పని చేస్తేనే మళ్లీ అధికారం ఇస్తారు, చేయకపోతే అవకాశం ఇవ్వరని తెలిపారు.

- Advertisement -

రాజన్న మా ఇలా వేల్పు. కుటుంబ సమేతంగా వచ్చి దర్శనం చేసుకున్నాం. ఆదివాసీ కుటుంబాలకు సమ్మక్క కంటే ముందు రాజన్నను దర్శించుకోవడం ఆనవాయితీ..’ అని సీతక్క పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement