ఆంధ్రప్రభ స్మార్ట్ – హైదరాబాద్ : తెలంగాణ గవర్నర్గా నియమితులైన జిష్ణుదేవ్ వర్మ నేటి సాయంత్రం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సాయంత్రం ఐదు గంటలకు ఆయన తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే ప్రమాణం చేయించనున్నారు. ఈ నేపథ్యంలో త్రిపురలోని తన నివాసమైన కుంజబన్ ప్యాలెస్ నుంచి బయలుదేరి ప్రత్యేక విమానంలో బయలుదేరి మధ్యాహ్నం శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు..
విమానాశ్రయంలో జిష్ణుదేవ్ వర్మ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు.. ఈ సందర్భంగా సాయుధ దళాల సమర్పించిన గౌరవ వందనం స్వీకరించారు. అలాగే కొత్త గవర్నర్ కు స్వాగతం పలికిన వారిలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ జితేందర్, త్రివిధ దళాలల అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ సలహా దారు వేణుగోపాల్ రావు, ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు.
- Advertisement -