కేసముద్రం, ఆగస్టు 9(ప్రభాన్యూస్ ): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలో రూ.2లక్షల 80 వేల విలువైన నల్లబెల్లం, పటికను తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.. ఈ కేసులో ముగ్గురీని అరెస్టు చేసి వాహనం సీజ్ చేశారు.
ఎస్సై కొగిలా తిరుపతి తెలిపిన వివరాల ప్రకారం 58 బస్తాల అక్రమ నల్లబెల్లం, పటికను రవాణా చేస్తున్న అశోక్ లే లాండ్ వాహనంను, ముగ్గురు నేరస్థులను పట్టుకున్నారు.
కల్వల గ్రామంలో బుధవారం కేసముద్రం పోలీసులు పెట్రోలింగ్ చేస్తుండగా ఎండీ. అమీర్ ఇంటి వద్ద అనుమానస్పదంగా ఉన్న అశోక్ లే లాండ్ వాహనంను పట్టుకొని తనిఖీ చేయగా అందులో 58 బస్తాల నల్లబెల్లం (28క్వింటల్స్ ), 50కేజీ పటికను కనిపించింది. అక్కడే ఉన్న ఎండీ అమీర్, మునికుంట్ల నరేష్, ఎండీ . అజారుద్దీన్ ముగ్గురి అదుపులోకి తీసుకొని విచారించారు. బీదర్ నుండి అక్రమంగా నల్లబెల్లం తెచ్చి కేసముద్రం చుట్టుపక్కల అమ్ముతున్నామని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.