వరంగల్ క్రైమ్, (ప్రభ న్యూస్) : అదీ నగర శివారు ప్రాంతం.. పైగా ఊరుకి కాస్తా దూరంగా ఉండే ఎస్సీ కాలనీలోని ఇంటినే పేకాట కేంద్రంగా మార్చి పేకాట ఆడుతున్నట్లు వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులకు పక్కా సమాచారం అందుకున్నారు. ఇన్స్ పెక్టర్ సి హెచ్ శ్రీనివాస్ జీ నేతృత్వంలో దాడి చేశారు. పది మంది పేకాటరాయుళ్లలో ఆరుగురు పోలీసులకు పట్టుబడగా, మరో నలుగురు పోలీసులకు చిక్కకుండా పరారయ్యారు. వారి వద్ద నుండి పది వేల ఐదు వందల రూపాయల నగదును, రెండు మొబైల్ ఫోన్స్ ను స్వాధీనం చేసుకున్నారు.
మడికొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని భట్టుపల్లి శివారులోని కడిపికొండ ఎస్సీ కాలనీలోని బీస రవి ఇంటినే పేకాట అడ్డాగా మార్చి, రెగ్యులర్ గా పేకాటాడుతున్నారు. బిస రవి (47), రంగసాయిపేటకు చెందిన ఎం డి ఇబ్రహీం పాషా (32), విలాసాగరం హరి (33), ఒగ్గుల సురేందర్ (31), కరీమాబాద్ కు చెందిన ఎం డి మహబూబ్ (46), వనం మధు (49)లను అరెస్ట్ చేశారు. రంగసాయిపేటకు చెందిన బొల్లెపల్లి రాజు, కరీమాబాద్ కు చెందిన గాండ్ల సతీష్, చింతల్ బ్రిడ్జి కి చెందిన నాగేశ్వర్ రావు, ఉర్సు కు చెందిన వడ్లకొండ సతీష్ లు పారిపోయిన వారిలో ఉన్నట్టు టాస్క్ ఫోర్స్ పోలీసులు తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
AndhraPrabha #AndhraPrabhaDigital