Friday, September 20, 2024

TG: పౌర హక్కుల నేతల అరెస్టు..

అక్రమంగా అరెస్టు చేయడం దారుణం
పినపాక నియోజకవర్గం వ్యాప్తంగా పోలీసుల తనిఖీలు
ప్రజాస్వామ్యానికి రక్షణ లేదు


మణుగూరు, సెప్టెంబరు 14(ప్రభ న్యూస్): తెలంగాణ రాష్ట్ర పౌరహక్కుల నేతలను పోలీసులు శనివారం తెల్లవారుజామున అరెస్టు చేసిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వాపురం మణుగూరులో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కరకగూడం మండలంలోని, రఘనాధపాలెం గ్రామంలోని తిరుమల దొనెలగుట్ట ప్రాంతంలో ఈనెల 5వ తేదీన పోలీసులకు, మావోయిస్టులకు ఎదురుకాల్పులు జరిగిన సంగతి విధితమే.

ఈ ఘటనపై తెలంగాణ రాష్ట్ర పౌర హక్కుల నేతలు పదకొండు మంది నిజా నిర్దారణకు కాల్పుల ప్రాంతానికి వెళ్తున్నారని, సమాచారం అందుకున్న పోలీసులు అశ్వాపురం, మణుగూరు ప్రాంతాల్లో బస్సులో ప్రయాణిస్తున్న వారిని దింపి అరెస్టు చేశారు. పౌర హక్కుల నేతలను అరెస్టు చేయడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం దారుణమని పౌరహక్కుల నేతలు తెలిపారు.

- Advertisement -

ప్రకటన స్వేచ్ఛకు ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పిన ప్రభుత్వం, ఎన్ కౌంటర్ వాస్తవాలు తెలుసుకునేందుకు వెళ్తుంటే అక్రమంగా పోలీసులు నిర్బంధించడం దారుణమన్నారు. శనివారం తెల్లవారుజాము నుండే పినపాక నియోజకవర్గ పోలీసులు అలెర్ట్ అయ్యారు. ఏడు మండలాల్లో ని పోలీసులు చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేసి, రాకపోకలు సాగించే వాహనాలను ఆపి, ప్రయాణికుల వివరాలు తెలుసుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement