Sunday, November 17, 2024

Arrest – కొనసాగుతున్న బీఆర్ఎన్ నేతల అరెస్ట్.. గృహ నిర్భంధంలో పలువురు ఎమ్మెల్యేలు

హైద‌రాబాద్ – చేతి గాయంతో బాధపడుతున్న మాజీ మంత్రి హరీష్ రావును పరామర్శించేందుకు వచ్చిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డిని, మాజీ ఎంపీ మాలోతు కవితను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు. కాగా, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఇంట్లో భేటీ అవుతామని మేడ్చల్‌ జిల్లా నేతలు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత హరీశ్‌రావు ఇంటి వద్ద భారీగా మోహరించారు. కోకాపేటలోని ఇంట్లోనే హరీశ్‌రావును హౌస్‌ అరెస్ట్‌ చేశారు. హరీశ్‌రావు ఇంటి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇటు హరీశ్‌రావు బయటికి వెళ్లకుండా అటు ఇంట్లోకి ఎవరూ రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. బీఆర్‌ఎస్‌ మహిళా నేతలు సునీతా లక్ష్మారెడ్డి, మాలోత్‌ కవితను హరీశ్‌రావు నివాసంలోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. అనంత‌రం వారిని అరెస్ట్ చేశారు..

ఇక త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ , చామ‌కూర మ‌ల్లారెడ్డితో ఇత‌ర బిఆర్ఎస్ నేత‌ల‌ను హౌజ్ అరెస్ట్ చేశారు పోలీసులు ..
మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హౌస్ అరెస్ట్ చేయ‌డ‌మే కాకుండా వెస్ట్ మారేడ్ పల్లి లోని నివాసం వద్ద పోలీసులు మోహ‌రించారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ ను బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు పోలీసులు .
తనకు డాక్టర్ వద్ద అపాయింట్ మెంట్ ఉందని పోలీసులకు వివరించినా విన‌ని పోలీసులు..

- Advertisement -

చామకూర మల్లారెడ్డి హౌస్ అరెస్ట్

శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపుడి గాంధీ ఇంట్లో బీఆర్ఎస్ పార్టీ సమావేశం పిలుపులో భాగంగా ముందస్తుగా మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు….చలో గాంధీ ఇల్లు పిలుపు లో భాగంగా బయటకు రాకుండా అడ్డుకున్నారు…బోయినపల్లి లోని మల్లారెడ్డి టి ముందు పోలీసులు మోహరించారు.బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని చెప్పుకుంటున్న గాంధీ ఇంటికి సమావేశం కోసం వెళ్ళటానికి ఆంక్షలు ఎందుకు పెడుతున్నారని,నిర్బంధాలు,ఆంక్షలు బీఆర్ఎస్ పార్టీకి కొత్త కాదని ఈ సందర్భంగా మల్లారెడ్డి గారు పేర్కొన్నారు.ప్రజాస్వామ్య పద్దతిలో శాంతియుత పోరాటాలు చేస్తామని, ప్రజలకు వాస్తవ పరిస్థితులు అర్థం అయ్యాయని అన్నారు.ప్రజా పాలన అంటే నిర్బంధాల అని ప్రశ్నించారు.

సబితా ఇంద్రారెడ్డి హౌస్ అరెస్ట్ …
శ్రీనగర్ కాలనీలోని నివాసంలో సబితా ఇంద్రారెడ్డి గృహనిర్బంధం చేసిన పోలీసులు….

(ప్రభ న్యూస్ బ్యూరో ఉమ్మడి రంగారెడ్డి) : శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఇంట్లో బీఆర్ఎస్ పార్టీ సమావేశం పిలుపులో భాగంగా పోలీసులు ముందస్తు చర్యలకు ఉపక్రమించారు. అందులో భాగంగానే మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు… చలో గాంధీ ఇల్లు పిలుపులో భాగంగా బయటకు రాకుండా అడ్డుకున్నారు…

నగరంలోని శ్రీనగర్ కాలనీలో సబితా ఇంద్రారెడ్డి ఇంటి ముందు పోలీసులు మోహరించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని చెప్పుకుంటున్న గాంధీ ఇంటికి సమావేశం కోసం వెళ్ళటానికి ఆంక్షలు ఎందుకు పెడుతున్నారని, నిర్బంధాలు, ఆంక్షలు బీఆర్ఎస్ పార్టీకి కొత్త కాదని సబితా రెడ్డి పేర్కొన్నారు. ప్రజాస్వామ్య పద్దతిలో శాంతియుత పోరాటాలు చేస్తామని, ప్రజలకు వాస్తవ పరిస్థితులు అర్థమయ్యాయన్నారు. ప్రజా పాలన అంటే నిర్బంధాలా అని ప్రశ్నించారు.

చామకూర మల్లారెడ్డి హౌస్ అరెస్ట్…
బోయిన్ పల్లిలోని తన నివాసంలో దిగ్బంధం…

(ప్రభ న్యూస్ బ్యూరో ఉమ్మడి రంగారెడ్డి) : శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఇంట్లో బీఆర్ఎస్ సమావేశం ఏర్పాటు చేస్తామనే హెచ్చరికల నేపథ్యంలో మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డిని పోలీసులు గృహ నిర్భందం చేసారు. శుక్రవారం బోయిన్ పల్లిలోని ఆయన నివాసం వద్దకు ఉదయమే పోలీసులు చేరుకొని బయటకు రాకుండా చర్యలు తీసుకున్నారు.


శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఇంట్లో బీఆర్ఎస్ పార్టీ సమావేశం పిలుపులో భాగంగా ముందస్తుగా పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు… చలో గాంధీ ఇల్లు పిలుపులో భాగంగా బయటకు రాకుండా అడ్డుకున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని చెప్పుకుంటున్న గాంధీ ఇంటికి సమావేశం కోసం వెళ్ళటానికి ఆంక్షలు ఎందుకు పెడుతున్నారని మల్లారెడ్డి ప్రశ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement