హైదరాబాద్, ప్రభన్యూస్ : ధర్మపురి నియోజకవర్గం పరిధిలో క్రిశాంత్ భారతీ కో ఆపరేటివ్ లిమిటెడ్ ఆధ్వర్యంలో రూ. 700 కోట్ల ప్రాథమిక అంచనాలతో రైబ్రైన్ ఇథనాల్ ఉత్పత్తి ఫ్యాక్టరీ ఏర్పాటుతో వేలాది మందికి ఉపాధి లభిస్తుందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. కంపెనీ ఏర్పాటుకు కృషి చేసిన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. దుబాయ్, బొంగాయి, బొగ్గు బావి మాత్రమే ఇక్కడి ప్రజలకు ఆధారమని, కానీ సీఎం కేసీఆర్ నిర్ణయంతో జగిత్యాల జిల్లా ప్రజలకు ఒక వైపు ఉపాధి, మరో వైపు ఉత్పత్తి మార్గాన్ని చూపించారన్నారు.
లోకల్ టు గ్లోబల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily